క్రీడాభూమి

అర్జున అవార్డులకు ధావన్, స్మృతి మంధాన పేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆటగాడు, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు అర్జున అవార్డులు ఇవ్వాలని బీసీసీఐ బుధవారం సిఫార్సు చేసింది. అర్జున అవార్డుల కోసం ఈ ఇద్దరి పేర్లను ప్రతిపాదించినట్టు బీసీసీఐ యాక్టింగ్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి తెలిపాడు. 32 ఏళ్ల శిఖర్ ధావన్ ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ సీజన్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతేకాకుండా టీమిండియా మూడు ఫార్మట్లలోనూ అతను రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. 2013లో టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై ఆడిన మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేశాడు. ఇక 21 ఏళ్ల మహిళా క్రికెటర్ స్మృతి మంధాన గత ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో భారత్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది ఐసీసీ ప్రకటించిన మహిళల ర్యాంకింగ్స్‌లో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లలో మంధాన ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో 531 పరుగులు చేసింది. ఇందులో ఐదు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా, ఈనెల 31న లార్డ్ మైదానంలో ఓ చారిటీ కోసం నిర్వహించే ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో పాల్గొనే వరల్డ్ ఎలెవెన్ టీమ్ తరఫున భారత్ తరఫున పాల్గొనేవారిలో హార్థిక్ పాండ్య, దినేష్ కార్తీక్ పేర్లను ప్రతిపాదించినట్టు బీసీసీఐ యాక్టింగ్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి పేర్కొన్నాడు.

చిత్రాలు..శిఖర్ ధావన్ * స్మృతి మంధాన