క్రీడాభూమి

సత్తా చాటిన భారత హాకీ జట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, ఏప్రిల్ 26: యూత్ ఒలింపిక్స్ కోసం జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో భారత పురుషులు, మహిళల జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించి సత్తా చాటాయి. మహిళల హాకీ జట్టు అసాధారణ ప్రదర్శనతో హోరెత్తించాయి. పురుషుల జట్టు 6-2 గోల్స్ తేడాతో ప్రత్యర్థి జపాన్‌పై, మహిళల జట్టు 10-0తో దక్షిణ కొరియాపై విజయం సాధించాయి. పూల్-బిలో భారత్ ఆరు పాయింట్లతో టాప్‌లో నిలిచింది. మహిళల మ్యాచ్ ప్రథమార్థంలో భారత్ జట్టులో లాల్రేమిసియామి మొదటి రెండు గోల్స్ సాధించగా, సింగపూర్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అత్యధికంగా గోల్స్ సాధించిన సంగీత పదవ నిమిషంలో మూడో గోల్‌ను సాధించింది. దీంతో ప్రథమార్థ భాగం ఆట ముగిసేసరికి భరాత్ 3-0 ఆధిక్యతను సాధించింది. ద్వితీయార్థ భాగం ఆటలో కూడా భారత్ మహిళలు చక్కటి ఆటతీరును ప్రదర్శించి మరో ఏడు గోల్స్ సాధించడంతలో పూల్-బిలో టాప్‌లో నిలువగలిగింది. ద్వితీయార్థ భాగం 11, 12 నిమిషాల్లో ముంతాజ్ ఖాన్ రెండు, సంగీత కుమార్ 14వ నిమిషంలో మరో గోల్ సాధించింది. దీపిక 19వ నిమిషయంలో గోల్ చేయడంతో ఆట ముగిసేసరికి భారత్ 10-0 తేడాతో దక్షిణ కొరియాపై ఘనవిజయం సాధించింది. ఆట ప్రారంభం మూడవ నిమిషంలో కెప్టెన్ వివేక్ సాగర్ ప్రసాద్ మొదటి గోల్ చేసి భారత్ శుభారం చేశాడు. ఎనిమిదో నిమిషంలో రబిచంద్ర రెండో గోల్ చేశాడు. తర్వాత రాహుల్ కుమార్ రాజ్‌భార్, మనిందర్ సింగ్‌లు చేరొక గోల్ చేయడంతో ప్రథమార్థ భాగం అట ముగిసేసరికి భారత్ 4-0 ఆధిక్యతను ప్రత్యర్థి జట్టుపై సాధించింది. ద్వితీయార్థ భాగం ఆటలో భారత్ జట్టులో రాహుల్ కుమార్, కెప్టెన్ వివేక్ చేరోక గోల్ చేయగా, జపాన్ ఆటగాడు కాజుమస మాట్సుమోటో 15వ నిమిషంలో గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోరు 6-1కి చేరింది. ఆట చివరి వరకు ఆట రసవత్తరంగా సాగింది. ద్వితీయార్థ భాగం చివరి నిమిషంలో జపాన్ ఆటగాడు గోల్ చేయడంతో భారత్ 6-2 గోల్స్ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. పూల్ -ఏలో భారత ఆరు పాయింట్లు సాధించి టాప్‌లోనిలిచింది.