క్రీడాభూమి

కొత్త కెప్టెన్‌తో బరిలోకి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: వరుస ఓటములతో ఢిల్లీ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి గౌతం గంభీర్ తప్పుకున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో తొలిసారిగా శుక్రవారం సొంత మైదానంలో కోల్‌కతాతో తలపడనుంది.
కెప్టెన్‌గా వచ్చిన సదవకాశాన్ని ఏమాత్రం జారవిడుచుకోకుండా తమ ఫ్రాంచైజీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు శ్రేయాస్ సమాయత్తమవుతున్నాడు. గంభీర్ నాయకత్వంలోని ఢిల్లీ జట్టు ఇంతవరకు ఇంతవరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా అందులో కేవలం ఒక మ్యాచ్ (ముంబయితో)లో విజయం సాధించింది.
ఆ తర్వాత జరిగిన ఐదు మ్యాచ్‌లలో ఓటములను మూటకట్టుకుంది. ఐపీఎల్‌లో ఎనిమిది జట్లున్న జాబితాలో ఢిల్లీ ఆఖరి స్థానంలో నిలబడి కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించింది. ఇక నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా ఇంతవరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా, వాటిలో మూడింట్లో విజయం సాధించి, మరో మూడింట్లో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో ఈ టీమ్ ఆరు పాయింట్లు సాధించింది. ఢిల్లీ జట్టు ఆటగాళ్లకు ఫిట్‌నెస్ సమస్య ప్రధాన అవరోధంగా మారుతోంది. జాసన్ రాయ్, క్రిస్ మోరిస్ కీలక ఆటగాళ్లు ఆరోగ్య సమస్యలతో జట్టుకు దూరంగా ఉన్నా ప్రస్తుతం కోలుకున్న నేపథ్యంలో శుక్రవారం నాటి తమ తదుపరి మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడే అవకాశం ఉంది. ఢిల్లీ జట్టు ముంబయిపై గెలిచిన ఒకే ఒక మ్యాచ్‌లో జాసన్ రాయ్ 91 పరుగులు చేశాడు. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఇంతవరకు ఆడిన పలు మ్యాచ్‌లలో 17, 13, 47, 4, 12 పరుగులు చేశాడు.
ఈసారి మాక్స్‌వెల్, జాసన్ రాయ్, క్రిస్ మోరిస్ విజృంభిస్తే ఢిల్లీ పరువు నిలబడుతుందని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కోల్‌కతా జట్టు బౌలింగ్ సమస్యతో సతమతమవుతోంది. కానీ బ్యాటింగ్‌తో రాణిస్తున్న క్రికెటర్లను నమ్ముకుంది. రెండుసార్లు 200 పరుగుల వరకు సాధించిన ఈ జట్టులో బౌలర్లు కూడా అదేతీరుతో ఆడితే ఖచ్చితంగా గెలుపు సాధిస్తామనే దీమాను వ్యక్తం చేస్తోంది. ఈ టీమ్‌లో సునీల్ నరైన్, కుల్‌దీప్ యాదవ్, పీయూష్ చావ్లా వంటివారితోపాటు యువ క్రికెటర్ శివం మావి, ఇంగ్లాండ్ ఆటగాడు టామ్ కరణ్‌పై గట్టి నమ్మకంతో ఉంది.