క్రీడాభూమి

రైజర్స్ వెన్ను విరిచిన అంకిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్ అంకిత్ రాజ్‌పుఠ్ తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అతని బౌలింగ్ ధాటికి హైదరాబాద్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడాల్సి వచ్చింది. దీంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన సన్‌రైజర్స్ కెప్టెన్ కనే విలియమ్‌సన్ మూడు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే అంకిత్ రాజ్‌పుఠ్ బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ గత మ్యాచ్‌లో మాదిరిగానే మళ్లీ నిరాశపరిచాడు.
ఎనిమిది బంతులు ఎదుర్కొన్న ధావన్ రెండు బౌండరీలతో 11 పరుగులు మాత్రమే చేసి అంకిత్ రాజ్‌పుఠ్ బౌలింగ్‌లో కరణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఆరు పరుగులు చేసి అంకిత్ రాజ్‌పుఠ్ బౌలింగ్‌లో ఆండ్రూకి క్యాచ్ ఇచ్చాడు. షాకీబ్ అల్ హసన్ 29 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో బౌండరీతో 28 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ ముఖం పట్టాడు. 51 బంతులు ఎదుర్కొన్న మనీష్ పాండే ఒక సిక్సర్, మూడు ఫోర్ల సహాయంతో 54 పరుగులు చేసి అంకిత్ రాజ్‌పుఠ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. మహ్మద్ నబీ రెండు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో నాలుగు పరుగులు చేసి అంకిత్ రాజ్‌పుఠ్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. పంజాబ్ బౌలింగ్‌లో అంకిత్ రాజ్‌పుఠ్ నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకోగా, ముజీబ్ ఉర్ రహ్మాన్ నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి ఒక వికెట్ చేజిక్కించుకున్నాడు.
అనంతరం ప్రత్యర్థి తమ ముందుంచ్ని 133 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 15 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. వికెట్ కీపర్ లోకేష్ రాహుల్ 26 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో బౌండరీతో 32 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ 22 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మరో బౌండరీ సహాయంతో 23 పరుగులు చేసి బాసిల్ థంపి బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. మయాంక్ అగర్వాల్ 15 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసి షాకీబ్ బౌలింగ్‌లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు. 17 బంతులు ఎదుర్కొన్న కరణ్ నాయర్ 13 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న అరోన్ పింఛ్ ఒక సిక్సర్‌తో ఎనిమిది పరుగులు చేసి షాకీబ్ బౌలింగ్‌లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు. మనోజ్ తివారీ మూడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు, కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, షాకీబ్ అల్ హసన్ రెండేసి వికెట్లు, బాసిల్ థంపి ఒక వికెట్ చేజిక్కించుకున్నారు.