క్రీడాభూమి

ముడుపుల కేసు ముగిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, డిసెంబర్ 11: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)లో చోటు చేసుకున్న పది కోట్ల డాలర్ల లంచాల కుంభకోణం కేసు ముగిసిపోయినట్లేనని, ఈ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణ కారణంగా ఫిఫా అధ్యక్ష పదవినుంచి సస్పెండయిన సెప్ బ్లాటర్ శుక్రవారం అన్నాడు. అంతేకాక ఫిఫాలోని ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడిన విషయం తనకు తెలియదని కూడా ఆయన వాదించాడు. గత మేలో స్విస్ పోలీసులు ఏడుగురు ఫిఫా అధికారులను అరెస్టు చేసే ముందు తనను హెచ్చరించకపోవడం పట్ల కూడా జపాన్‌కు చెందిన ‘నిక్కీ బిజినెస్’ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేసాడు. అది ఒక సునామీ అని కూడా ఆయన వ్యాఖ్యానించాడు. ఈ ఇంటర్వ్యూ శనివారం పత్రికలో పబ్లిష్ అయింది. కాగా, రాబోయే వారాల్లో తాను తిరిగి తన బాధ్యతలను చేపడతానని ఆశిస్తున్నట్లు కూడా ఆయన చెప్పాడు. ఇలాంటి ఒక వ్యవహారం జరగబోతోందని స్విస్ అధికారులు కనీసం నాకు చెప్పి ఉండాలి. జరిగిన దాన్ని, ఇప్పటికీ కొన్ని సమాఖ్యల్లో జరుగుతున్న, జరిగిన వాటిని చూసినప్పుడు నేను దిగ్భ్రాంతికి గురయ్యా’ అని బ్లాటర్ చెప్పాడు. ‘నా కార్యవర్గంలోకొంతమంది పాల్పడిన చెడ్డపనులకు నేను నైతికంగా బాధ్యుడ్ని కాదు. ఎందుకంటే వారిని పరిచయం చేసే లేదా బర్తరఫ్ చేసే అవకాశం నాకు లేదు’ అని ఆయన అన్నాడు. కాగా, గత నెల ఆరోగ్యపరంగా ఇబ్బందులెదుర్కొన్న 79 ఏళ్ల బ్లాటర్ క్రిస్మస్‌నాటికల్లా పూర్తిగా కోలుకుంటానని, ఫిబ్రవరి 26న ఎన్నుకోబడే తన వారసుడికి బాధ్యతలు అప్పగించడం కోసం సకాలంలో కార్యాలయానికి వెళ్తానని ఆశిస్తున్నట్లు చెప్పాడు.