క్రీడాభూమి

ధోనీకి రైనా షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, ఏప్రిల్ 14: గత సీజన్ వరకూ ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఆడిన సురేష్ రైనా ఈ సీజన్‌లో గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా అతనికే షాకిచ్చాడు. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో గురువారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ మరో 12 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. 164 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ 27 పరుగుల వద్ద ఆజింక్య రహానే వికెట్‌ను కోల్పోయింది. ప్రవీణ్ తంబే బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగిన అతను 21 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ ఫఫ్ డు ప్లెసిస్, కెవిన్ పీటర్సన్ స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించిన తర్వాత పీటర్సన్ వికెట్ కూలింది. అతను 31 బంతుల్లో 37 పరుగులు చేసి, డ్వెయిన్ బ్రేవో బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మరికొద్ది సేపటికే డు ప్లెసిస్ కూడా పెవిలియన్ చేరాడు. అతను 43 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 69 పరుగు చేసి దినేష్ కార్తీక్ స్టంప్ చేయగా, తంబే బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. స్టీవెన్ స్మిత్ (5), మిచెల్ మార్ష్ (7) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. రైజింగ్ పుణె 20 ఓశర్లలో ఐదు వికెట్లకు 163 పరుగులు సాధించగా, అప్పటికీ ధోనీ (22), రజత్ భాటియా (0) నాటౌట్‌గా ఉన్నారు.
గుజరాత్ లయన్స్ 164 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగగా, ఆరోన్ ఫించ్, బ్రెండన్ మెక్‌కలమ్ మొదటి వికెట్‌కు 8.3 ఓవర్లలో 85 పరుగులు జోడించారు. 36 బంతుల్ల ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు సాధించిన ఫించ్‌ని ఇశాంత్ శర్మ క్యాచ్ అందుకోగా మురుగన్ అశ్విన్ అవుట్ చేశాడు. మెక్‌కలమ్ 31 బంతుల్లో 49 పరుగులు చేసి, ఇశాంత్ శర్మ బౌలింగ్‌లో డు ప్లెసిస్‌కు చిక్కాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లు ఉన్నాయి. రైనా 24 పరుగులకు అవుట్‌కాగా, చివరిలో రవీంద్ర జడేజా (4 నాటౌట్), డ్వెయిన్ బ్రేవో (22 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ రైజింగ్ పుణెపై గుజరాత్ లయన్స్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు.
సంక్షిప్త స్కోర్లు
రైజింగ్ పుణె సూపర్‌జెయిట్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 (డు ప్లెసిస్ 69, కెవిన్ పీటర్సన్ 37, ధోనీ 22 నాటౌట్, ప్రవీణ్ తంబే 2/33, రవీంద్ర జడేజా 2/18).
గుజరాత్ లయన్స్: 18 ఓవర్లలో 3 వికెట్లకు 164 (ఆరోన్ ఫించ్ 50, బ్రెండన్ మెక్‌కలమ్ 49, సురేష్ రైనా 24, డ్వెయిన్ బ్రేవో 22 నాటౌట్).