క్రీడాభూమి

మలేసియాతో చావోరేవో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపో (మలేసియా), ఏప్రిల్ 14: ప్రతిష్ఠాత్మక అజ్లన్ షా హాకీ టోర్నమెంట్ ఫైనల్ చేరేందుకు చివరి అవకాశానిన సద్వినియోగం చేసుకోవడానికి, శుక్రవారం నాటి చివరి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది. సర్దార్ సింగ్ నాయకత్వంలోని ఈ జట్టు 5-1 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచేసి అభిమానుల ఆశలు పెంచింది. కానీ, ఆ వెటనే డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో భారత్ ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి. కెనడా, జపాన్, పాకిస్తాన్ జట్లను ఓడించిన భారత్‌కు ఆస్ట్రేలియా (1-5), న్యూజిలాండ్ (1-2) చేతిలో పరాజయాలు తప్పలేదు. ఆస్ట్రేలియా ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి, మొత్తం 15 పాయింట్లతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరుకు అర్హత సంపాదించే అవకాశాలపై జపాన్, కెనడా, పాకిస్తాన్ ఆశలు వదులుకున్నాయి. దీనితో పోరు న్యూజిలాండ్, భారత్, మలేసియా జట్ల మధ్యే ఉంటుంది. శుక్రవారం మలేసియాను ఓడిస్తే, భారత్‌కు ఫైనల్ చేరే అవకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
నిలకడగా ఆడాలి
మలేసియాతో మ్యాచ్ కీలకంగా మారిన నేపథ్యంలో, ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో కూడిన సర్దార్ సేన ఎంత నిలకడగా ఆడుతుందనే విషయంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అనుభ రాహిత్యానికి, నిలకడలేమి కూడా తోడు కావడంతో భారత హాకీ జట్టు అభిమానులను ఆశనిరాశల మధ్య ఊగిసలాడిస్తున్నది. సామర్థ్యం పుష్కలంగా ఉన్నప్పటికీ, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ఆటగాళ్లు విఫలమవుతున్నారని భారత కోచ్ థామస్ అల్ట్‌మన్స్ వాపోతున్నాడు. జట్టు మొత్తాన్ని ఒకేతాటిపైకి తెచ్చేందుకు, నిలకడగా ఆడించేందుకు కెప్టెన్ సర్దార్ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని చెప్పలేంగానీ, అనుకున్న ఫలితాలను ఇవ్వడం లేదన్నది నిజం.