క్రీడాభూమి

పాక్ హాకీ గోల్‌కీపర్ మన్సూర్ అహ్మద్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, మే 12: పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ హాకీ గోల్‌గీపర్ మన్సూర్ అహ్మద్ (49) కన్నుమూసారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్‌లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం గుండె సంబంధిత సమస్యతో మృతి చెందారు. ఆయన మృతికి పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ సంతాపం వ్యక్తం చేసింది. ఇంత చిన్నవయసులోనే అతని మృతి చెందడం హాకీ రంగానికి తీరని లోటని పేర్కొంది. 338 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన అహ్మద్ పాకిస్థాన్ జట్టు ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించాడని పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ కార్యదర్శి షాబాజ్ అహ్మద్ పేర్కొన్నారు. హాకీ అభివృద్ధికి, జూనియర్ ఆటగాళ్లకు మెళకువలు నేర్పడంలో ఆయన పాత్ర మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. 1994 ప్రపంచకప్ సాధనలో ఆయన చూపించిన ప్రతిభను ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా జర్మనీ, హాలెండ్ దేశ ఆటగాళ్ల పెనాల్టీ షూటవుట్‌లను అడ్డుకోవడంలో ఆయన దిట్ట అని పేర్కొన్నారు. మన్సూర్ అనారోగ్య పరిస్థితిపై తాము ప్రభుత్వాన్ని సంప్రదించామని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడమే కాక, అతనికి ఆర్థికంగా సహాయం అందించిందని షాబాజ్ అహ్మద్ వివరించారు. ఆయన మృతి హాకీ క్రీడారంగానికి తీరని లోటని ఆయన విచారం వ్యక్తం చేశారు. కాగా, గత కొంతకాలంగా గుండె సంబంధితవ్యాధితో బాధపడుతున్న మన్సూర్ అహ్మద్ 1994లో పాకిస్తాన్ వరల్డ్‌కప్ సాధించిన జట్టులో గోల్‌కీపర్. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఇతనికి గుండెలో పేస్‌మేకర్‌ను గతంలోనే అమర్చారు. తర్వాత కూడా ఆయనకు గుండె సంబంధ సమస్యలు రావడంతో అతనికి మెకానికల్ హార్టు ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు నిర్ణయించగా, ఆ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా వైద్యం చేయించుకోవాలని సూచించగా, అహ్మద్ దానిని తిరస్కరించారు. అంతకంటే ఆధునిక పద్ధతిలో తాను గుండెమార్పిడి చేయించుకుంటానని, అదీ కూడా భారతదేశంలో వైద్యచికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దాని నిమిత్తం భారత్‌లోని చెన్నైకు వెళ్లాలనుకున్నారు.
చెన్నైలోని ఫోర్టిస్ మలార్ హాస్పిటల్‌లో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ కొమరాక్షి బాలకృష్ణను సంప్రదించగా, ఆయన మన్సూర్ కేసును పరిశీలించి అతను భారత్‌కు వస్తే వెంటనే గుండె ట్రాన్స్‌ప్లాంట్ చేస్తానని హామీనిచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో మన్సూర్ ప్రయాణం చేయడానికి అతని ఆరోగ్యం సహకరించదని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ నవీద్ కమర్ పేర్కొనడంతో ఆయన పాకిస్థాన్‌లోనే చికిత్స పొందుతూ శనివారం హఠాత్తుగా మృతి చెందారు.