క్రీడాభూమి

ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలపై రాజకీయ మేఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, మే 13: ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీలకు ఇంకా నెలరోజుల సమయం మాత్రమే ఉంది. రాజకీయంగా పశ్చిమ దేశాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా తన సూపర్ పవర్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు, ఫుట్‌బాల్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ ఫుట్‌బాల్ క ప్ పోటీల నిర్వహణకు 2010లో రష్యా ఎంపికే ఒక వివాదం. ము ఖ్యంగా లంచాలు ఇచ్చి రష్యా ఈ అవకాశాన్ని కొట్టేసిందన్న ఆరోపణలే ఈ వివాదానికి కారణం. ఈ ఎంపిక తర్వాత సిరియా, ఉక్రెయిన్ ల అంశాల్లో పశ్చిమ దేశాలతో వివా దం, యుకెలో మాజీ రష్యా గూఢచారి హత్య వంటివి రష్యాకు, పశ్చి మ దేశాలకు మధ్య అగాధాన్ని మరింత పెంచాయి. నాలుగేళ్ల ముం దు రష్యా ఆతిథ్యమిచ్చిన సోచి క్రీడల్లో ప్రభుత్వమే డోపింగ్‌ను ప్రో త్సహించిందన్న ఆరోపణలు రావడంతో, ఈ ఏడాది జరిగే పయాంగ్‌ఛాంగ్ ఒలింపిక్స్ క్రీడలనుంచి బహిష్కరణను ఎదుర్కొంటోంది. మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి పరిణామాలు పునరావృతమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అమెరికా, రష్యాలు పరస్పరం పెద్ద సంఖ్యలో దౌత్యవేత్తలను బహిష్కరించుకోవడం ఇటీవలి కాలంలో మ రో విపరిణామం. అయినప్పటికీ వ్లాదిమిర్ పుతిన్‌లో 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతటి శక్తివంతంగా ఉన్నారో, అదే స్థాయిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో నాటి సోవియట్ యూనియన్ సైనికదళాలు ప్రవేశించినందుకు నిరసనగా 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ప్రపంచంలో దాదాపు సగం దేశాలు పాల్గొనలేదు.
ప్రస్తుతం పుతిన్ ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించడం ద్వా రా దేశీయంగా, అంతర్జాతీయంగా సమర్థుడిగా గుర్తింపు పొందాలని యత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ క్రీడలకోసం రష్యా 13 బిలియన్ యుఎస్ డాలర్లు ఖర్చు చేసింది. 2014 వింట ర్ ఒలింపిక్స్ నిర్వహణకు రష్యా మొత్తం 50 బిలియన్ యుఎస్ డాలర్లు ఖర్చు చేసినప్పటికీ, మిశ్రమ స్పందనే లభించడం గమనార్హం.