క్రీడాభూమి

మహారాష్ట్ర నుంచి ఐపిఎల్ మ్యాచ్‌ల తరలింపుపై నిర్ణయం నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అన్న విషయంలో తుది నిర్ణయం శుక్రవారం వెలువడే అవకాశం కనిపిస్తున్నది. చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఐపిఎల్ నిర్వాహణ కమిటీ ఇక్కడ సమావేశమై, బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై చర్చిస్తుంది. ఈనెల 30వ తేదీ తర్వాత మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహించ వద్దని, ఇతర ప్రాంతాలకు తరలించాలని బాంబే హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మహారాష్టల్రో కరవు విలయతాండం చేస్తుండగా, నీటి చుక్క దొరకకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపిఎల్ మ్యాచ్‌ల కోసం లక్షలాది లీటర్ల నీటిని వాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తూ, తక్షణమే మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాలని లోక్‌సత్తా మూమెంట్ అనే స్వచ్ఛంద సంస్థ బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) సంయుక్తం చేసిన వాదనలను విన్నది. పిల్ ఆలస్యంగా దాఖలైంది కాబట్టి ఆరంభ మ్యాచ్‌లను తరలించమని కోరే అవకాశం లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఏప్రిల్ 30 తర్వాత జరగాల్సిన మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్టక్రు మొత్తం 20 మ్యాచ్‌లను కేటాయించగా, వాటిలో 7 మ్యాచ్‌లు మాత్రమే అప్పటికి పూర్తవుతాయి. ఫైనల్‌సహా మిగతా 13 మ్యాచ్‌లను వేరే ప్రాంతాల్లో నిర్వహించాలి. ఇలావుంటే, బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఐపిఎల్ కమిటీ శుక్రవారం ఇక్కడ సమావేశమై చర్చించనుంది. బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా సమావేశానికి హారయ్యే అవకాశాలున్నాయి. అదే విధంగా మహారాష్టక్రు చెందిన రెండు ఐపిఎల్ జట్లు, ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తారని సమాచారం.
ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు సిద్ధం: డిడిసిఎ
ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ) ముందుకొచ్చింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లను ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నిర్వహిస్తే తాము అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది.