క్రీడాభూమి

జోరు కొనసాగిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, మే 13: ప్రస్తుత ఐపీఎల్‌లో దాదాపు నిష్క్రమణ దశలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులోని బలహీనతలను సొమ్ము చేసుకునే దిశగా యత్నిస్తే తప్ప ఆర్‌సీబీకి విజయం నల్లేరుపై బండి నడక కాబోదు.
గత మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను ఓడించడంతో ఆర్‌సీబీకి కొత్త ఊపిరి లభించినట్లయింది. ఇక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు మొదట్లో మంచి ఆటతీరును ప్రదర్శించినా తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతోంది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లతో వరుస పరాజయాలు కుంగదీసినా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 పాయింట్లతో మంచి స్థానంలోనే కొనసాగుతోంది. కానీ రాయల్ ఛాలెంజర్స్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఇప్పటికీ పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. అయితే ఊహించనివి జరగడం ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఉన్న ప్రత్యేకత. విరాట్ కోహ్లీ, తప్పనిసరిగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుపై మంచి ఒత్తిడి తీసుకొస్తాడనడంలో ఎంతమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. డేర్‌డెవిల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో కోహ్లీ, డెవిల్లర్స్ ఇద్దరూ తమ స్టైలిష్ బ్యాటింగ్‌తో అర్ధ సెంచరీలు పూర్తిచేసి తమకు ఆ జట్టు విసిరిన సవాలును తెలిగ్గా ఛేదించగలిగారు. కాగా ఆర్‌సీబీ, కింగ్స్ 11 పంజాబ్ జట్లు రెండూ తమ బ్యాంటింగ్ పైనే అత్యధికంగా ఆధారపడ్డాయి. ఆర్‌సీబీ కోహ్లీ, డెవిల్లర్స్‌పై ఆశలు పెట్టుకుంటే, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెఎల్ రాహుల్, క్రిస్ గేల్‌ల స్ఫూర్తిదాయక ఆటతీరుపై నమ్మకంతో ఉన్నాయి. ఆర్‌సీబీ బౌలింగ్ ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, ఆడిన 11 మ్యాచ్‌ల్లో కోహ్లీ 466 పరుగులతో మంచి స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా రెండు మ్యాచ్‌లు తక్కువ ఆడినా డెవిల్లర్స్ కూడ 358 పరుగులు సాధించడం విశేషం. మణిదీప్ సింగ్ 11 మ్యాచ్‌ల్లో 245 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఇక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు విషయానికి వస్తే రాహుల్ ఇప్పటివరకు 162 స్ట్రైక్ రేటుతో ఐదు అర్థ సెంచరీలు సాధించాడు. రాహుల్ సగటు పరుగులు 62. తొలి మ్యాచ్‌ల్లో గేల్ మంచి ప్రదర్శన ఇచ్చినా, తర్వాత వెనుకబడిపోయాడు. గేల్ వేగంగా 50 పరుగులు సాధిస్తే ఆట పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అయితే ఆర్‌సీబీ, కింగ్స్‌ఎలెవెన్ పంజాబ్ జట్లను బౌలింగ్ బలహీనత పీడిస్తోంది. కింగ్స్‌ఎలెవెన్ పంజాబ్ జట్టుకు చెందిన ఆండ్రూ టై సగటున ఒవర్‌కు 8 పరుగులిచ్చి 20 వికెట్లు తీసాడు. ఇక టీనేజర్ ముజబూర్ రహమాన్ తన స్పిన్ మాయాజాలంతో సగటున ఒవర్‌కు 6.99 పరుగులిచ్చి మొత్తం 14 వికెట్లు తీయడం అద్భుతమే. మరి సమస్య ఉన్నదల్లా కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌తోనే. 11 మ్యాచ్‌ల్లో 8.13 సగటుతో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయడం జట్టుకు పెద్ద లోపం. ఇక అక్షర్ పటేల్ పనితీరు ఇంకా అధ్వాన్నంగా ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు మాత్రమే తీసిన పటేల్ ఇచ్చిన సగటు పరుగులు 8.73. బరిందర్ శరణ్ 6 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీసినా ఇచ్చిన సగటు పరుగులు 10.40. మోహిత్ శర్మ ఇరు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసాడు. కానీ ఇచ్చిన సగటు పరుగులు 10.88. ఈ విధంగా బౌలర్ల పనితీరు అధ్వాన్నంగా ఉండటం జట్లకు పెద్ద బలహీనతగా పరిణమించింది. ముఖ్యంగా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయాల్సిన పరిస్థితుల్లో, విపరీతంగా పరుగులివ్వడం జట్లకు ఆశనిపాతంగా మారింది. ఈ మొత్తం మ్యాచ్‌ల్లో యజువేంద్ర చాహల్ (11 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు, సగటు పరుగులు 7.57), ఉమేష్ యాదవ్ (11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు సగటు పరుగులు 8.23)ల పనితీరు మాత్రమే బాగుంది. మరో స్పెషలిస్టు బౌలర్ మహమ్మద్ సిరాజ్ (8 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు, సగటు పరుగులు 9.13) పనితీరు పరవాలేదు. స్పిన్నర్లు సేవ్, చాహెల్‌లు దారుణంగా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ అనుభవరాహిత్యం, పవన్ నెగి విపరీతంగా పరుగులివ్వడం కోహ్లీ టీమ్‌కు పెద్ద నిరాశకలిగించే అంశం. క్రిస్ వొయేక్స్ 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసినప్పటికీ ఇచ్చిన సగటు పరుగులు 10.36. ఈ నేపథ్యంలో టిమ్ సౌథీ (5 మ్యాచుల్లో 5 వికెట్లు, సగటు పరుగులు 8.42)ని కెప్టెన్ తప్పనిసరిగా రంగంలోకి దించాల్సి రావచ్చు.