క్రీడాభూమి

కష్టాల్లో ఐర్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్లిన్, మే 13: మాలాహైడ్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఆరురోజుల టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ దారుణంగా ప్రారంభమైంది. ఆదివారం లంచ్ సమయానికి ఐదు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కోలుకోలేని కష్టాల్లో కూరుకుపోయింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 310 పరుగులకు డిక్లేర్ చేసింది. పాకిస్తాన్ కెప్టెన్ సర్‌ఫ్రాజ్ అహమ్మద్ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు చేసిన తర్వాత, తెలివిగా లంచ్‌కు కేవలం 30 నిముషాల మందు డిక్లేర్ చేయడం ఐర్లాండ్‌కు ఆశనిపాతమైంది. బ్యాటింగ్‌కు దిగగానే కేవలం 5 పరుగులకే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురిని కోల్పోయి చతికిలబడింది. మహమ్మద్ అబ్బాస్ వేసిన బంతికి వెటరన్ బ్యాట్స్‌మన్ ఎడ్ జోయ్‌సీ ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. ఆప్పటికి అతడు చేసిన పరుగులు కేవలం నాలుగు. జోయ్‌సీతో పాటు ఓపెనర్‌గా వచ్చిన న ఆండ్రూ బాల్‌బిర్నే తొలి బంతికే రన్ ఔట్ కావాల్సింది కానీ ఎలాగో బయటపడ్డాడు. తర్వాత ఎల్‌బీడబ్యు అయి పెవిలియన్ దారి పట్టాడు. ఇక లంచ్ సమయానికి కేవలం ఒకే బంతి మిగిలి వున్నదనగా, పాక్ ఎడమచేతి బౌలర్ మహమ్మద్ అమీర్ వేసిన బంతి, ఐర్లాండ్ కెప్టెన్ విలియమ్ పోటర్‌ఫీల్డ్ ఆఫ్‌స్టంప్‌కు తగలడంతో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆవిధంగా ఐర్లాండ్ ప్రధాన బ్యాట్స్‌మెన్ పతన ప్రస్థానం ముగిసింది. లంచ్ సమయానికి అబ్బాస్ నాలుగు పరుగులకు రెండు వికెట్లు తీయగా, అమిర్ 3.1 ఒవర్లలో ఒక వికెట్ పడగొట్టాడు. అంతకు ముందు పాకిస్తాన్ 268 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్, బ్యాంటింగ్ ప్రారంభించి 310 పరుగులు చేసింది. ఫహీమ్ అష్రాఫ్ అత్యధికంగా 83 పరుగులు చేసాడు. అతనితో పాటు క్రీజ్‌లో ఉన్న షాదాబ్ ఖాన్ 55 పరుగులు చేయగా ఏడో వికెట్‌కు వీరిద్దరి భాగస్వామ్యం 117 పరుగులు. ఐర్లాండ్‌కు చెందిన టిమ్ ముర్త్‌గాహ్ 25 ఒవర్లలో 55 పరుగులు చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు.