క్రీడాభూమి

ప్లే ఆఫ్ రేసులో రాజస్థాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 13: ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక్కడి వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ఎవిన్ లివీస్ నిలకడగా ఆడి అర్థ సెంచరీ సాధించడంతో పాటు వికెట్ కీపర్ బట్లర్ (94 పరుగులు) రాణించడంతో ముంబయి ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించింది. జట్టులో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడటంతో తొలి పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టాపోకుండా 86 పరుగులు చేసిన ముంబయి జట్టులో ఆ తర్వాత వరుగా వికెట్లు కోల్పోయి బ్యాట్స్‌మన్‌లు తడపడ్డారు. 11 ఓవర్ నాలుగో బంతికి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ భారీ షాట్‌ను కోట్టబోయి జయదేవ్ ఉనద్కట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ పట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 31 బంతులలో ఏడు బౌండరీలతో 38 పరుగులు చేశాడు. ఇదే ఓవర్‌లో మరుసటి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ ఉనద్కట్‌కు క్యాచ్ ఇచ్చి ఒక పరుగు కూడా సాధించకుండా డాకౌట్ ఆయ్యాడు. దీంతో బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమవడంతో ఇషాన్ కిషన్ 12, క్రునాల్ పాండ్య 3 పరుగులు చేసి పెవిలియన్ పట్టడంతో ముంబయిపై ఒత్తిడి పెరిగింది. అయితే చివర్లో పాండ్య విజృంభించి ఆడి 21 బంతుల్లో 36 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 168 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లు ఆర్చర్, బెన్‌స్టోక్స్‌లు చెరి రెండేసీ వికెట్లు, జయదేవ్, కుల్‌కర్ణిలకు చేరోక వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయాల్స్ 16 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 144 పరుగులు సాధించింది. జట్టులో బ్యాటింగ్‌లో కోనసాగుతున్న జాస్ బట్లర్ 53 బంతుల్లో 9 బౌండరీలు, ఐదు సిక్సర్లతో 94 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేసి, సంజు శాంసన్ 26 పరుగులతో బ్యాటింగ్‌లో కోనసాగుతున్నాడు. జట్టు కెప్టెన్ 36 బంతుల్లో నాలుగు బౌండరీలతో 37 పరుగులు చేసి ఔటాయ్యాడు. దీంతో రాజస్థాన్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుని ఐపీఎల్ ప్లే ఆఫ్‌లో ఆశలు సజీవం చేసుకుంది. జట్టులో వికెట్ కీపర్ బట్లర్ తనశైలీలో బ్యాటింగ్‌లో రాణించి మ్యాచ్ చివరి వరకు నిలకడగా ఆడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.