క్రీడాభూమి

ఫెదరర్ మళ్లీ నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 14: పురుషుల టెన్నిస్ విభాగంలో ఏటీపీ తాజాగా ప్రకటించిన జాబితాలో మళ్లీ రోజర్ ఫెదరర్ నెంబర్‌వన్‌గా నిలిచాడు. మాడ్రిడ్ మాస్టర్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ నుండి నాదల్ వైదొలగడంతో ఇంతవరకు తొలి స్థానంలో ఉన్న అతనిని తోసిరాజని ఫెదరర్ ఆ స్థానాన్ని ఆక్రమించాడు. ప్రపంచ మాజీ నెంబర్ వన్ నవోక్ జొకోవిచ్ ఆరు స్థానాలు దిగజారి 18వ ర్యాంక్‌లో నిలిచాడు. అలెగ్జాండర్ జ్వర్వెవ్ తన మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 31 ఏళ్ల దక్షిణాఫ్రికా కెవిన్ ఆండర్సన్ అత్యధికంగా ర్యాంకింగ్స్‌లో ఎగబాకాడు. అదేవిధంగా రష్కాకు చెందిన టీనేజర్ డెనిస్ షాపోవాల్వో 14 స్థానాలు ఎగబాకి 29వ స్థానంలో నిలిచాడు. రోజర్ ఫెదరర్ ఫస్ట్ ర్యాంక్, రాఫెల్ నాదల్ అలెగ్జాండర్ జ్వరెవ్, గ్రిగర్ దిమిట్రోవ్, మారిన్ సిలిస్, జువాన్ మార్టిన్ డెల్ పోట్రో, కెవిన్ ఆండర్సన్, డోమినిస్ థీమ్, జాన్ ఐసనెర్, డేవిడ్ గోఫిన్, పాబ్లో కర్రెనో, సామ్ క్వెర్రీ, రోబర్టో బౌటిస్టా, జాక్ సాక్, డీగో స్వార్ట్‌జ్‌మ్యాన్, లుకాస్ పౌలీ, థామస్ బెర్డిచ్, నవోక్ జొకోవిచ్, కీల్ ఎడ్మండ్, హేన్ చుంగ్ వరుసగా 1 నుంచి 20 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు.