క్రీడాభూమి

అంత సంయమనం ఎలా సాధ్యమో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సైతం ప్రశాంతంగా ఉండడం ఒక్క ధోనీకే చెల్లిందని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోష్లీ ప్రశంసిస్తూ, అన్ని సమయంలోను సంయమనం కోల్పోకుండా ఉండే ఈ కళను అతనినుంచి నేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నానని అన్నాడు. ‘కెప్టెన్సీకి సంబంధించినంతవరకు అతను ఒక రికార్డు సృష్టించాడు. సాద్యమైనవన్నీ అతను సాధించాడు. అలాగే వన్‌డేలలో నంబర్ వన్ టెస్టుల్లో, టి-20లలో కూడా నంబర్ వన్ సాదించాడు. మరే ఇతర కెప్టెన్ సాధించడానికి అతను ఏమీ మిగల్చలేదు’ అని ధోనీనుంచి ఏ క్వాలిటీలు నేర్చుకోవాలని అనుకుంటున్నారని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అడిగినప్పుడు కోహ్లీ అన్నాడు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లోభారత్‌లో ప్రపంచ టి-20 చాంపియన్ షిప్‌ను శుక్రవారం అధికారికంగా ప్రకటించిన తర్వాత జరిగిన ప్యానెల్ చర్చలో సంజయ్ మంజ్రేకర్ ప్రధాన పాత్ర వహించాడు. ఈ చర్చా గోష్ఠిలో కోహ్లీ సహ ఆటగాళ్లు అజింక్యా రహానే, శిఖర్ ధావన్‌తో పాటుగా ఐసిసి చీఫ్ డేవ్ రిచర్డ్స్‌న్ కూడా పాల్గొన్నారు. ‘అయితే నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా టెస్టు ఫార్మాట్‌లో మరింత సంయమనంగా ఉండడం ఆయన కెప్టెన్సీనుంచి నేర్చుకోవాలని అనుకుంటున్నాను. గత రెండు సిరీస్‌లో ఈ విషయంలో నేను మెరుగుపడినట్లు కూడా అనుకుంటున్నాను. అయితే ఒత్తిడి సమయంలో కూడా ఆందోళనకు గురికాకుండా ఉండే అతని సామర్థ్యంను నేర్చుకోవాలని అనుకుంటున్నాను’ అని కోహ్లీ అన్నాడు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి ప్రపంచ టి-20 చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో ధోనీ కెప్టెన్సీ సామర్థ్యం ఏమిటో అందరికీ అర్థమైందని కోహ్లీ చెప్పాడు.ఈ టోర్నమెంట్‌లో నారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) టోర్నమెంట్ రాకతో భారత్‌కు హోం అడ్వాటేజ్ అనేది లేకుండా పోయిందని కోహ్లీ అభిప్రాయ పడ్డాడు. దాదాపు8-9 ఏళ్లుగా పలువురు విదేశీక్రికెటర్లు ఈ టోర్నమెంట్‌లో ఆడుతున్నారని, భారత దేశ పరిస్థితులకు వాళ్లు బాగా అలవాటు పడ్డారని కూడా అతను అన్నాడు.

లండన్ క్లాసిక్ ఆరో గేమ్‌లో ఆనంద్ ఓటమి

లండన్, డిసెంబర్ 11: లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇక్కడ ముగిసిన ఆరో రౌండ్ గేమ్‌లో అతను రష్యన్ గ్రాండ్ మాస్టర్ అలెగ్జాండర్ గ్రిష్చుక్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ టోర్నీలో తొలుత మూడు గేమ్‌లను డ్రా చేసుకున్న ఆనంద్‌కు ఆ తర్వాత ఇది వరుసగా మూడో ఓటమి. మొత్తం పది మంది ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆనంద్ ఈ ఓటమికి ఆనంద్ భారీగా మూల్యం చెల్లించుకుని పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారాడు. కాగా, ఆరో రౌండ్ గేమ్‌లో ఆనంద్‌ను ఓడించి ఈ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకున్న గ్రిష్చుక్ 4 పాయింట్లతో అనీష్ గిరి (హాలెండ్), హికమురు నకమురా (అమెరికా), మాక్సిమ్ వాచియెర్-లాగ్రావ్ (ఫ్రాన్స్)ల సరసన చేరాడు.