క్రీడాభూమి

ప్లే ఆఫ్‌కు దారులున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 16: ప్రస్తుత ఐపీఎల్‌లో ప్లే ఆఫ్ దశకు చేరుకోవడానికి తమకు దారులు మూసుకుపోలేదని, అవి ఇంకా తెరిచే ఉన్నాయని, తప్పకుండా తమ జట్టు ప్లే ఆఫ్ దశకు చేరుకుంటుందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానే ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 142 పరుగులు చేసిన రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఇంతవరకు 13 మ్యాచ్‌లు ఆడగా, ఆరింట్లో విజయం సాధించింది. మరో ఏడింట్లో పరాజయం పాలై 12 పాయింట్లు సాధించి ఐపీఎల్‌లోని మొత్తం ఎనిమిది జట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఈనెల 19న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. బెంగళూరు ప్రస్తుత 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నందున, ఆ జట్టు ప్లే ఆఫ్‌లో బెర్త్ ఖాయం చేసుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే, తమకు ప్లే ఆఫ్‌లో చోటు కోసం ఇంకా అవకాశాలు ఉన్నందున ప్రత్యర్థికి గట్టి పోటీనిస్తామని ఆయన పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో పైచేయితో తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని, గత మ్యాచ్‌లలో దొర్లిన పొరపాట్లను పునరావృతం చేసుకుంటున్నామని, మళ్లీ అవే తప్పులు దొర్లకుండా జాగురూకతతో వ్యవహరిస్తామని రహానే పేర్కొన్నాడు. కోల్‌కతాతో జరిగిన గత మ్యాచ్‌లో ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి, జోస్ బట్లర్ ఔటైన తర్వాత తనతో సహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన స్కోరు చేయడంలో విఫలమయ్యామని ఆయన అంగీకరించాడు. బ్యాటింగ్‌లో విఫలం కావడంతోనే ఆ మ్యాచ్‌లో తాము ఓటమిని మూటకట్టుకున్నామని, కోల్‌కతా తమపై విజయం సాధించిందని ఆయన అన్నాడు. కాగా, తమ జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ల ద్వయం బెన్ స్టోక్స్, జోస్ బట్లర్‌లకు ఈ సీజన్‌లో గత మ్యాచ్ ఆఖరిదని, వారు పాకిస్తాన్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడనున్నారని ఆయన తెలిపాడు. అయితే, మిగిలిన మ్యాచ్‌లలో తలపడే తమ టీమ్‌లో ఈ ఇద్దరు విదేశీ ఆటగాళ్లు లేనిలోటు ఎవరూ భర్తీ చేయలేనిదని రహానే విచారం వ్యక్తం చేశాడు. జోస్ బట్లర్ అద్భుత ఆటగాడని, ప్రతి ఆటగాడికి తమ దేశం తరఫున పెద్ద ఫార్మట్‌లలో ప్రాతినిధ్యం వహించాలన్న కోరిక ఉంటుందని ఆయన అన్నాడు. తమ టీమ్‌లో ముగ్గురు, నలుగురు విదేశీ క్రికెటర్లు ఉన్నారని, వారంతా బాగా రాణిస్తున్నారని అంటూ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో వారి నుంచి మంచి ఫలితాలు ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నాడు.