క్రీడాభూమి

ఆహ్వానం అందితే పాక్‌లో టూర్‌కు రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్లిన్, మే 16: పాకిస్తాన్‌లో పర్యటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఇది కొత్త ఊపిరినిచ్చే పరిణామమే. టెస్టు హోదాను దక్కించుకున్న తర్వాత ఐర్లాండ్ తన తొలి మ్యాచ్‌ని పాకిస్తాన్‌తో ఆడింది. ఐదు వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ, ఫాలోఆన్‌కు దిగి, ఆతర్వాత పాక్‌ను రెండో ఇన్నింగ్స్‌కు దింపడం ఐర్లాండ్ సాధించిన విజయంగానే చెప్పుకోవాలి. పాక్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు, ఒకానొ దశలో 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, లక్ష్యం 160 పరుగుల మాత్రమే కావడంతో ఆ జట్టుకు విజయం సాధించడం కష్టం కాలేదు. అయితే, పాక్‌ను కొంతవరకైనా నిలువరించిన ఐర్లాండ్ అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తింపు సంపాదించుకోగలనని నిరూపించింది. చారిత్రాత్మక తొలి టెస్టు ముగిసిన నేపథ్యంలో, ఇర్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ డ్యూట్రామ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్తాన్‌లో పర్యటించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. అయితే, పీసీబీ నుంచి అధికారికంగా ఆహ్వానమేదీ అందలేదని చెప్పాడు. ఒకవేళ పీసీబీ కోరితే, పాకిస్తాన్‌కు జట్టును పంపుతామని అన్నాడు. కాగా, 2007లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాక్‌లో క్రికెట్ ఆడేందుకు దేశాలేవీ ముందుకు రాలేదు. ఫలితంగా పాకిస్తాన్‌కు యూఏఈని హోం గ్రౌండ్‌గా మార్చుకోవాల్సి వచ్చింది. 2015లో జింబాబ్వే జట్టు పాక్‌లో పర్యటించినప్పటికీ లాభం లేకపోయింది. పాక్‌లో పర్యటించేందుకు జట్లు ఏవీ ముందుకు రావడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకొని, వరల్డ్ ఎలెవెన్ జట్టును పంపింది. ఇది ప్రయత్నం కూడా ఊహించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో టూర్‌కు తాము సిద్ధంగా ఉన్నామని ఐర్లాండ్ ప్రకటించడం పీసీబీకి ఊరటనిస్తున్నది. త్వరలోనే ఐర్లాండ్‌కు అధికారికంగా ఆహ్వానం పంపే అవకాశాలున్నాయి.