క్రీడాభూమి

విజృంభించిన మిశ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు బోణీ చేసింది. ఇంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు శుక్రవారం న్యూఢిల్లీలోని సొంత మైదానం ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించి తొలి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే రాబట్టగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 13.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు సాధించి సునాయాసంగా లక్ష్యాన్ని అధిగమించింది. డేర్‌డెవిల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 11 పరుగులకే 4 వికెట్లు కైవసం చేసుకుని కింగ్స్ ఎలెవెన్ పతనాన్ని శాసించాడు.
అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 8 పరుగుల వద్దే ఓపెనర్ మురళీ విజయ్ (1) వికెట్‌ను చేజార్చుకోగా, ఆ తర్వాత అమిత్ మిశ్రా నిప్పులు చెరిగే బంతులతో పంజాబ్‌పై విరుచుకుపడ్డాడు. అమిత్ జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన పంజాబ్ జట్టులో మనన్ వోహ్రా (32) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. షాన్ మార్ష్ (13), అక్షర్ పటేల్ (11), మొహిత్ శర్మ (15), ప్రదీప్ సాహు (18-నాటౌట్) తప్ప ఎవరూ రెండంకెల స్కోర్లు సాధించకుండానే పెవిలియన్‌కు పరుగు తీశారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 111 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది.
అనంతరం 112 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కూడా 9 పరుగులకే శ్రేయాస్ అయ్యర్ (3) వికెట్‌ను చేజార్చుకుంది. అయితే ఓపెనర్ క్వింటోన్ డీకాక్, సంజూ శాంసన్ క్రీజ్‌లో నిలదొక్కుకుని స్కోరు బోర్డును ముందుకు నడిపారు. పంజాబ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు రెండో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (33) నిష్క్రమించగా, డీకాక్ (42 బంతుల్లో 59 పరుగులు), పవన్ నేగీ (2 బంతుల్లో 8 పరుగులు) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 13.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు సాధించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు మరో 39 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను మట్టికరిపించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ఇది వరుసగా రెండో పరాజయం.
సంక్షిప్తంగా స్కోర్లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 111/9 (మనన్ వోహ్రా 32, షాన్ మార్ష్ 13, అక్షర్ పటేల్ 11, మొహిత్ శర్మ 15, ప్రదీప్ సాహు 18-నాటౌట్). వికెట్ల పతనం: 1-8, 2-37, 3-52, 4-52, 5-59, 6-65, 7-73, 8-90, 9-99. బౌలింగ్: అమిత్ మిశ్రా 4/11, జహీర్ ఖాన్ 1/14, జయంత్ యాదవ్ 1/23.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: 13.3 ఓవర్లలో 113/2 (క్వింటోన్ డీకాక్ 59-నాటౌట్, శ్రేయాస్ అయ్యర్ 3, సంజూ శాంసన్ 33, పవన్ నేగీ 8-నాటౌట్).
వికెట్ల పతనం: 1-9, 2-100. బౌలింగ్: సందీప్ శర్మ 1/6, అక్షర్ పటేల్ 1/25.