క్రీడాభూమి

ఫలితంలేని ఢిల్లీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి నిష్క్రమించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ శుక్రవారం ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యా చ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢీకొని 34 పరుగుల తేడాతో విజయం సాధిం చింది. ఈ ఫలితం అటు చెన్నైకిగానీ, ఢిల్లీకిగానీ ఎలాంటి లాభం లేకపోవ వడంతో, ఉత్కంఠ భరితంగా సాగినప్పటికీ, ఈ మ్యాచ్ అభిమానులను ఆ కట్టుకోలేకపోయంది. నాలుగో విజయం సాధించిన ఢిల్లీ మొత్తం ఎనిమిది పాయంట్లతో చివరి స్థానంలోనే కొనసాగుతుండగా, ఐదో పరాజయాన్ని ఎ దుర్కొన్న చెన్నై 16 పాయంట్లతో ప్రస్తుతం రెండో స్థానంలోనే ఉంది.
మ్యాచ్‌కి ముందే సూపర్ ఫోర్‌లో దాదాపుగా చోటు దక్కించుకున్న చెన్నై, మొదటి రెండు స్థానాల్లో ఉండాలన్న పట్టుదలతో ఢిల్లీతో పోరాడిం ది. టాస్ గెలిచి, ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించి, 20 ఓవర్లలో 5 వికెట్ల కు 162 పరుగుల వద్ద కట్టడి చేయగలిగింది. టాప్ ఆర్డర్‌లో రిషభ్ పంత్ (38), మిడిల్ ఆర్డర్‌లో విజయ్ శంకర్ (36 నాటౌట్), హర్షల్ పటేల్ (36) కొద్దిసేపు చెన్నై బౌలింగ్‌ను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు.
డేర్‌డెవిల్స్‌పై పూర్తి ఆథిపత్యాన్ని కనబరుస్తున్న రీతిలో చెన్నై ఇన్నింగ్స్ మొదలైంది. కానీ, 46 పరుగుల వద్ద షేన్ వాట్సన్ ఔట్ కావడంతో చెన్నై కంగుతిన్నది. 14 పరుగులు చేసిన అతనిని ట్రెంట్ బౌల్ట్ క్యాచ్ పట్టగా, అమిత్ మిశ్రా పెవిలియన్‌కు పంపాడు. ధాటిగా ఆడుతున్న అంబటి రాయుడు 29 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్ల తో 50 పరుగులు చేసి, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో గ్లేన్ మాక్స్‌వెల్‌కు దొరికి పోవడంతో చెన్నై రన్‌రేట్ తగ్గడం మొదలైంది. సురేష్ రైనా (15), శామ్ బి ల్లింగ్స్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో, వికెట్‌ను కాపాడుకునే ప్రయ త్నంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా నింపాదిగా ఆడారు. జట్టు గెలిపించే బాధ్యత తీసుకుంటాడనుకున్న ధోనీ 17 పరుగుల వ్యక్తిగ త స్కోరువద్ద ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇవ్వ డంతో చెన్నై కష్టాలు రెట్టింపయ్యాయ. సాధించాల్సిన రన్‌రేట్ క్రమంగా పెరగడంతో డీలాపడిపోయన ధోనీ సేన చివరి ఓవర్‌లో విజయానికి 39 పరుగుల దూరంలో నిలిచింది. బౌల్ట్ వేసిన ఆ ఓవర్‌లో డ్వెయన్ బ్రేవో (1) ఔట్‌కాగా చెన్నై నాలుగు పరుగులు చేయగలిగింది. ఆ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 128 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 27, దీపక్ చాహర్ ఒక పరుగుతో నాటౌట్‌గా ఉన్నారు. మొత్తం మీద ఢిల్లీ ఏమాత్రం ప్రయోజనం లేని విజయాన్ని నమోదు చేసింది.