క్రీడాభూమి

మళ్లీ నాదల్, జొకోవిచ్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, మే 19: ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆటగాళ్లు, చిరకాల ప్రత్యర్థులు రాఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్ మరోసారి ఢీకొనేందుకు సిద్ధమయ్యారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించే మ్యాచ్‌కి సిద్ధమైన వీరిద్దరూ ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తలపడడం ఇది 51వసారి. పురుషుల సింగిల్స్ రెండో సెమీ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారుడు కెయ్ నిషికొరీని 2-6, 6-1, 6-3 తేడాతో ఓడించిన నాదల్ సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. అంతకు ముందు జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో నాదల్ 4-6, 6-1, 6-2 ఆధిక్యంతో ఫాబియో ఫోగ్నినీపై విజయం సాధించి, సెమీస్ చేరిన విషయం తెలిసిందే. టెన్నిస్ చరిత్రలోనే ‘ఆల్‌టైం గ్రేట్’ జాబితాలో చోటు సంపాదించుకున్న నాదల్, జొకోవిచ్ ఫైనల్‌లో స్థానం కోసం జరిపే పోరు సహజంగానే ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇలావుంటే, మరో సెమీ ఫైనల్‌లో మారిన్ సిలిక్‌తో జర్మనీ యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ పోటీపడతాడు. జ్వెరెవ్ క్వార్టర్ ఫైనల్‌లో డేవిడ్ గోఫిన్‌పై 6-4, 3-6, 6-3 తేడాతో విజయం సాధించాడు. మరో క్వార్టర్ ఫైనల్‌లో సిలిక్ 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో పాబ్లో కారెఫియో బస్టాపై గెలుపొంది సెమీస్ చేరాడు.