క్రీడాభూమి

హాకీ ఇండియా అధ్యక్షుడిగా రాజీందర్ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: హాకీ ఇండియా (హెచ్‌ఐ) నూతన అధ్యక్షుడిగా రాజీందర్ సింగ్ నియమితుడయ్యాడు. మరియమ్మ కోషీ రాజీనామా చేయడంతో హాకీ ఇండియాలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాజీందర్ అధ్యక్షుడిగా శనివారం పదవీ బాధ్యతల చేపట్టాడు. గతంలో అతను హెచ్‌ఐకి కోశాధికారిగా పని చేశాడు. మరియమ్మ కోషి రాజీనామా చేయడంతో అమె స్థానంలో రాజీందర్ నియమితుడవడం సంతోషంగా ఉందని హెచ్‌ఐ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ముస్తాఖ్ అహ్మద్ తెలిపాడు. హెచ్‌ఐ అధ్యక్షుడిగా కొనసాగిన నరీందర్ బాత్రా 2016 నవంబర్‌లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. ఫలితంగా అతను హెచ్‌ఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ స్థానాన్ని కేరళ మహిళ జట్టు మాజీ క్రీడాకారిణి మరియమ్మ కోషితో భర్తీ చేశారు. అటు ఆటలోనూ, ఇటు పాలనా వ్యవహారాల్లోను మంచి అనుభవం కలిగిన మరియమ్మ రెండు దశాబ్దాలు హెచ్‌ఐ సేవలు అందించి, అనేక మార్పులు తీసుకువచ్చారి. ఎంతో మంది క్రీడాకారులకు మనుసులు గెలుచుకున్నారని అహ్మద్ తెలిపాడు.