క్రీడాభూమి

‘డిఫెండింగ్’కు చివరి పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: ఈసారి ఐపీఎల్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగినప్పటికీ, పేలవమైన ప్రదర్శనలతో, నిలకడలేని ఆటతో అభిమానులను నిరాశపరుస్తున్న ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్‌కు చేరడమే ధ్యేయంగా ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయిలో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. స్వయంగా రోహిత్ మంచి బ్యాట్స్‌మన్. ఫామ్‌లో ఉంటే అతనిని నిలువరించడం ఎవరికైనా కష్టమే. కానీ, అతను ఎప్పుడు రాణిస్తాడో? ఎందుకు విఫలమవుతాడో? చెప్పలేని పరిస్థితి నెలకొంది. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ లభించిన తర్వాత ఎవరూ ఊహించని రీతిలో రాణిస్తున్నాడు. అయితే, మిగతా వారి నుంచి అతనికి సరైన మద్దతు లభించడం లేదన్నది వాస్తవం. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కిరన్ పోలార్డ్, మాయాంక్ అగర్వాల్ తదితరులు పరుగుల వరద పారించగల సమర్థులే. అయితే, వీరిలో ఎవరూ నిలకడగా ఆడడం లేదు. క్రీజ్‌లో నిలదొక్కుకొని పరువురను కొల్లగొట్టడం లేదు. ఒక మ్యాచ్‌లో పరుగులు చేస్తే, మరో మ్యాచ్‌లో చేతులెత్తేయడం వీరికి ఆనవాయితీగా మారింది. బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ విభాగంలో కొంత బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, పూర్తి సామర్థ్యంతో రాణిస్తే ఈ లోటును భర్తీ చేయడం కష్టమేమీ కాదు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, కృణాల్ పాండ్యతోపాటు మిచెల్ మెక్‌క్లీన్‌గన్, ముస్త్ఫిజుర్ రహమాన్, రాహుల్ చాహర్ వంటి సమర్థులైన బౌలర్లు ముంబయి జట్టులో ఉన్నారు. అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణిస్తున్న జస్‌ప్రీత్ బుమ్రా అనూహ్యంగా ఐపీఎల్‌లో విఫలమవుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులిచ్చిన బౌలర్‌గా ఇశాంత్ శర్మ రికార్డును బద్దలు చేయడం బుమ్రా సరైన ఫామ్‌లో లేడనడానికి నిదర్శనం. ఢిల్లీపై గెలిస్తే తప్ప ప్లే ఆఫ్‌కు అర్హత లభించదన్న ఒత్తిడి మధ్య ముంబయి ఆటగాళ్లు ఎంత వరకూ నిలబడి గెలుస్తారో చూడాలి.
ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్‌ని ఆడుతున్న ఢిల్లీకి మరో విజయమైనా, పరాజయమైనా వచ్చేదీ లేదా పోయేదీ ఏమీ లేదు. కానీ, హోం గ్రౌండ్‌లో విజయంతో గ్రూప్ దశను ముగించి, అభిమానులకు కొంతైనా ఊరటనిద్దామన్న ఆలోచనలో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఢిల్లీ ఉంది. దీనికితోడు డిఫెండింగ్ చాంపియన్ ముంబయిని ఓడించామన్న సంతృప్తి కూడా ఆ జట్టుకు లభిస్తుంది. గత మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచిన ఢిల్లీకి ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు లేకపోలేదు.
*
మ్యాచ్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది.