క్రీడాభూమి

భారత్ వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, మే 20: పురుషుల విభాగంలో థామస్, మహిళల విభాగంలో ఉబర్ కప్ కోసం ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక బాడ్మింటన్ టోర్నీ మొదటి రౌండ్‌లో భారత్ దారుణంగా విఫలమైంది. థామస్ కప్‌లో ఫ్రాన్స్‌ను ఢీకొన్న భారత్ 1-4 తేడాతో పరాజయాన్ని చవిచూస్తే, ఉబర్ కప్‌లో కెనడాతో తలపడిన మహిళలు కూడా అదే తేడాతో ఓటమిపాలయ్యారు. ఫ్రాన్స్‌తో భారత్ పోరు పురుషుల సింగిల్స్‌తో మొదలైంది. సాయి ప్రణీత్ చక్కటి ఆటతో తన ప్రత్యర్థి బ్రైస్ లెవెరెజ్‌ను 21-7, 21-18 తేడాతో ఓడించి శుభారంభాన్ని అందించాడు. అయితే, ఆ ఆధిక్యాన్ని భారత్ నిలబెట్టుకోలేకపోయింది. అర్జున్, రామచంద్రన్ శ్లోక్ జోడీ 13-21, 16-21 తేడాతో బాస్టిన్ టెర్సాడీ, జూలియన్ మయివో జోడీ చేతిలో ఓటమిపాలైంది. రెండో సింగిల్స్‌లో సమీర్ వర్మను 21-18, 20-22, 21-18 ఆధిక్యంతో ఓడించిన లుకాస్ కోర్వీ ఫ్రాన్స్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. రెండో డబుల్స్‌లో అర్జున్ జార్జి, సన్యం శుక్లా జోడీని 21-10, 21-12 స్కోరుతో చిత్తుచేసిన థామ్ జిక్వెల్, రోనన్ లాబెర్ జోడీ ఫ్రాన్స్‌కు తిరుగులేని విధంగా 3-1 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టింది. మూడో సింగిల్స్‌లో లక్ష్య సేన్ కూడా పరాజయాన్ని ఎదుర్కోవడంతో, భారత్‌కు చేదు అనుభవం తప్పలేదు. లక్ష్య సేన్‌ను తోమా జూనియర్ పొపొవ్ 22-20, 19-21, 21-19 తేడాతో ఓడించాడు. కాగా, ఈ పోటీల్లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో, మంగళవారం చైనాతో భారత్ పోరాడనుంది.
సైనా ఓటమితో మొదలు
ఉబర్ కప్ మొదటి రౌండ్‌లో కెనడాను ఢీకొన్న భారత్ 1-4 తేడాతోనే పరాజయాన్ని చవిచూసింది. మహిళల మొదటి సింగిల్స్‌లో మిచెల్ లి చేతిలో సైనా నెహ్వాల్ 21-15, 16-21, 16-21, రెండో సింగిల్స్‌లో రాచెల్ హొడెరిచ్ చేతిలో జక్కా వైష్ణవీ రెడ్డి 11-21, 13-21 తేడాతో పరాజయాలను ఎదుర్కోవడంతో కెనడాకు 2-0 ఆధిక్యం లభించింది. డబుల్స్ విభాగంలో జక్కంపూడి మేఘన, పూర్వీషా జోడీ 21-19, 21-15 స్కోరుతో మిచెల్ టాంగ్, జోసెఫిన్ వూ జోడీపై విజయం సాధించి, భారత్‌కు విజయాన్ని అందించారు. అయితే, మూడో సింగిల్స్‌లో శ్రీకృష్ణప్రియ కుడవలూరిని బ్రిట్నీ టామ్ 21-11, 21-15 తేడాతో ఓడించి, కెనడా ఆధిక్యాన్ని 3-1కి పెంచింది. చివరిదైన రెండో డబుల్స్‌లో రాచెల్ హోండెరిచ్, క్రిస్టెన్ సాయ్ 21-15, 21-16 స్కోరుతో సంయోగితా గోర్పాడే, ప్రజాక్తా సావంత్ జోడీని వరుస సెట్లలో ఓడించి, కెనాను 4-1 తేడాతో గెలిపించారు. తర్వాతి మ్యాచ్‌ల్లో భారత్ 22న ఆస్ట్రేలియా, 23న జపాన్ జట్లతో తలపడుతుంది.