క్రీడాభూమి

వారసుడొచ్చాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 20: ఫ్రెంచ్ మాజీ ఫుట్‌బాలర్ జినెడిన్ జిదానే కుమారుడు లుకా జిదానే ప్రొఫెషనల్ ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. ప్రతిష్ఠాత్మక రియల్ మాడ్రిడ్ తరఫున అతను చాంపియన్స్ లీగ్ సాకర్ టోర్నమెంట్‌లో భాగంగా విల్లారియల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ప్రపంచ ఫుట్‌బాల్ 3ఆల్‌టైం గ్రేట్2 జాబితాలో స్థానం సంపాదించిన జిదానే కుమారుడిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తానని 20 ఏళ్ల లుకా అంటున్నాడు. ఇలావుంటే, విల్లారియల్‌తో జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ తొలుత ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, ఆతర్వాత ప్రత్యర్థికి గోల్స్ చేసే అవకాశాలిచ్చి, చివరికి డ్రాతో సంతృప్తి చెందింది. మ్యాచ్ 11వ నిమిషంలోనే గెరాత్ బాలే గోల్ చేసి, రియల్ మాడ్రిడ్ ఖాతా తెరిచాడు. 32వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో సాధించిన గోల్‌తో ఆ జట్టు 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రియల్ మాడ్రిడ్ పూర్తిగా డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చింది. ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాకుండా జాగ్రత్త పడింది. ద్వితీయార్ధం ఆరంభంలోనూ అదే వ్యూహాన్ని అనుసరించింది. అయితే, గోల్స్ చేయాలన్న పట్టుదలతో ఉన్న విల్లారియల్ ఎదురుదాడికి దిగి, రియల్ మాడ్రిడ్ రక్షణ వలయాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. 70వ నిమిషంలో రోజర్ మార్టినెజ్ ద్వారా గోల్‌ను సంపాదించింది. మ్యాచ్ ముగింపు దశకు చేరుకున్నప్పుడు, సమూ కాస్టిలెజో ఈక్వెలైజర్‌ను సాధించాడు. ఆతర్వాత గోల్స్ నమోదు కాకపోవడంతో, మ్యాచ్ 2-2గా డ్రా అయింది.