క్రీడాభూమి

భారత్‌పై కొరియా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాంగె సిటీ, మే 20: ఇక్కడ జరుగుతున్న మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ రెండో రోజు భారత్‌కు కలిసిరాలేదు. మొదటి రోజు ఆటలో భారత్ శుభారాంభం చేసిన రెండో రోజు పోటీలకు అతిథ్యమిస్తున్న జట్టు చేతిలో ఓటమి తప్పలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నిరూటి విజేత భారత్ 0-1 తేడాతో కోరియా చేతిలో ఓడిపోయింది. ఆట ప్రారంభం నుంచి ఇరు జట్లు క్రీడాకారిణులు అద్భుతంగా ఆడారు. మొదటి 15 నిమిషాల ఆట పుర్తయ్యే సరికి ఇరు జట్లు ఒక గోల్ కూడా సాధించలేదు. అసక్తి కరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆట 24 నిమిషంలో కోరియా క్రీడాకారిణి మీ హ్యన్ పార్క్ కొట్టిన బంతి గోల్ పోస్ట్‌కు తగిలి వెనక్కి రావడంతో, దానిని అందుకున్న యంగ్‌సీల్ లీ అద్భుతమైన గోల్ సాధించడంతో కొరియా గెలిచింది.