క్రీడాభూమి

రియో వరల్డ్ కప్‌లో భారత షూటర్ల శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డీ జెనిరో, ఏప్రిల్ 16: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) వరల్డ్ కప్ టోర్నీలో భారత ట్రాప్ షూటర్లు మానవ్‌జీత్ సింగ్ సంధూ, కినాన్ చెనాయ్ తొలి రోజు శుభారంభాన్ని సాధించారు. ప్రపంచ మాజీ చాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ షూటర్ అయిన మానవ్‌జీత్ పురుషుల ట్రాప్ ఈవెంట్ తొలి క్వాలిఫికేషన్ రౌండ్‌లో మొత్తం 50 లక్ష్యాలకు గాను 48 లక్ష్యాలను ఛేదించి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకోగా, తొలిసారి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనబోతున్న యువ షూటర్ చెనాయ్ 47 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు. ఈ రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన ఆల్బెర్టో ఫెర్నాండెజ్ (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం) మొత్తం 50 లక్ష్యాలను ఛేదించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, క్రొయేషియాకు చెందిన గియోవన్నీ సెర్నోగొరజ్ 49 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో క్వాలిఫికేషన్ రౌండ్లు పూర్తయిన తర్వాత అగ్రస్థానంలో నిలిచిన ఆరుగురు ఫైనల్‌కు రౌండ్‌కు చేరుకుంటారు. అంతకుముందు వీరంతా ఆదివారం మరో 75 లక్ష్యాలను ఛేదించి తమ సత్తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రైఫిల్, పిస్తోల్, షాట్‌గన్ విభాగాల్లో ఐఎస్‌ఎస్‌ఎఫ్ నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌ను ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్ క్రీడలకు సన్నాహకంగా పరిగణిస్తుండటంతో ఈ పోటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.