క్రీడాభూమి

పంజాబ్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, మే 20: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) దశలో చివరి మ్యాచ్‌లో చెన్నై సూ పర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ఓడించింది. ఒకానొక దశలో చెన్నై ఓటమి ప్రమాదంలో పడినప్పటికీ, సురేష్ రైనా చక్కటి బ్యాటింగ్ ప్రతిభ ఆ జట్టు ను విజయపథంలో నడిపించింది. పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టాప్ ఆర్డర్‌ను త్వరత్వరగా కోల్పోయంది. ఓపెనర్లు లోకేష్ రాహుల్ (7), క్రిస్ గేల్ (8), ఆరోన్ ఫించ్ (4) ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియ న్ చేరారు. వేగంగా పరుగులు సాధించే సత్తావున్న టాప్ క్లాస్ వెనుదిరగడంతో కంగుతి న్న పంజాబ్‌కు మనోజ్ తివారీ, డేవిడ్ మిల్లర్ కొంత సేపు అండగా నిలిచారు. నాలుగో వికెట్‌ను 60 పరుగులు జత కలిసిన తర్వాత తివారీ వికెట్ కూలింది. 30 బంతుల్లో 35 పరుగులు చేసిన అతనిని ధోనీ క్యాచ్ పట్టగా రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. 24 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద మిల్లర్ కూడా ఔటయ్యాడు. డ్వెయన్ బ్రేవో అతనిని క్లీన్ బౌల్డ్ చేశా డు. టాప్ స్కోరర్ కరుణ్ నాయర్ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడగా అక్షర్ పటేల్ (14) అత నికి కొంతసేపు అండగా నిలిచాడు. కెప్టెన్ అశ్విన్, ఆండ్రూ టై పరుగుల ఖాతా తెరవకుం డానే పెవిలియర్ చేరారు. నాయర్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి, 26 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 54 పరుగులు సాధించి డ్వెయన్ బ్రేవో బౌలింగ్‌లో దీపక్ చాహర్‌కు దొరికి పోయాడు. అంకిత్ రాజ్‌పుత్ రెండు పరుగుల చేసి, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫఫ్ డు ప్లెసిస్‌కు క్యాచ్ అందించాడు. పంజాబ్ 19.4 ఓవర్లలో 153 పరగులకు ఆలౌటైంది. అ ప్పటికి మోహిత్ శర్మ రెండు పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. చెన్నై బౌలర్లలో లున్గీ ఎం డిగీ నాలుగు ఓవర్లలో కేవలం పది పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. డ్వెయన్ బ్రేవో, శార్దూల్ ఠాకూర్‌కు చెరి రెండు వికెట్లు లభించాయ.
సామాన్యమైన లక్ష్యాన్ని సాధించేందుకు ఇన్నింగ్స్ ఆరంభించిన చెన్నై కేవలం మూడు పరుగుల వద్ద అంబటి రాయుడు వికెట్ కోల్పోయంది. ఒక పరుగు చేసిన అతను మోహిత్ శర్మ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం అంకి త్ రాజ్‌పుత్ ఒకే ఓవర్‌లో ఫఫ్ డు ప్లెసిస్ (14), శామ్ బిల్లింగ్స్ (0) వికెట్లను పడగొట్టి, చె న్నైని దారుణంగా దెబ్బతీశాడు. హర్భజన్ సింగ్‌తో కలిసి సురేష్ రైనా స్కోరును పెంచేం దుకు శ్రమించాడు. వీరి భాగస్వామ్యం నిలదొక్కుకుంటున్న సమయంలోనే పంజాబ్ కెప్టె న్ రవిచంద్రన్ అశ్విన్ హర్భజన్ సింగ్ (19)ను ఎల్‌బీగా పెవిలియన్‌కు పంపాడు. వేగంగా ఆడి, 20 బంతుల్లోనే, ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 39 పరుగులు చేసిన దీపక్ చాహర్‌ను మోహిత్ శర్మ క్యాచ్ అందుకోగా అశ్విన్ ఔట్ చేశాడు. అప్పటికి చెన్నై స్కోరు 114 పరు గులు. ఆరో స్థానంలో కెప్టెన్ ధోనీ బ్యాటింగ్‌కు దిగడంతో ఉత్సాహంతో రెచ్చిపోయన రైనా పరుగుల వరద పారిదించాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 19.1 ఓవర్లలో ఐదు వికెట్లకు 159 పరుగులు చేసి, చెన్నై విజయభేరి మోగించే సమయానికి రైనా 61 (48 బంతులు/ రెండు సిక్సర్లు/ నాలుగు ఫోర్లు), ధోనీ 16 (7 బంతులు/ ఒక సిక్సర్/ ఒక ఫోర్) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
సంక్షిప్త స్కోర్లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 19.4 ఓవర్లలో 153 ఆలౌట్ (కరుణ్ నాయర్ 54, మనోజ్ తి వారీ 35, డేవిడ్ మిల్లర్ 24, లున్గీ ఎంగిడీ 4/10, శార్దూల్ ఠాకూర్ 2/33, బ్రేవో 2/39).
చెన్నై సూపర్ కింగ్స్: 19.1 ఓవర్లలో ఐదు వికెట్లకు 159 (సురేష్ రైనా 61 నాటౌట్, దీపాక్ చాహర్ 39, ఎంఎస్ ధోనీ 16 నాటౌట్, అంకిత్ రాజ్‌పుత్ 2/19).