క్రీడాభూమి

ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదకొండో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గ్రూప్ దశను ముగించుకొని, ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు సిద్ధమైంది. పాయంట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన జట్లు మొదటి క్వాలిఫయర్‌లో ఢీ కొంటాయ. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళుతుంది. ఓడిన జట్టుకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ ఉంటుంది. అందులో ఓడిన జట్టు నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ఫైనల్ చేరాలంటే మరో మ్యాచ్ ఆడాలి. అంటే, మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో చోటు దక్కించుకునేందుకు రెండో క్వాలిఫయర్‌లో తలపడతాయ. ఆ మ్యాచ్‌లో ఓడిన జట్టు నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు మొదటి క్వాలిఫయర్‌లో గెలిచి ఫైనల్ చేరిన జట్టుతో టైటిల్ పోరు ఉంటుంది.
గ్రూప్ దశ పూర్తయ్యే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ చెరి 18 పాయంట్లతో మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయ. కోల్‌కతా నైట్ రైడర్స్ 16, రాజస్తాన్ రాయల్స్ 14 పాయంట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయ.
ఈనెల 22న ముంబయలోని వాంఖడే స్టేడియంలో జరిగే మొదటి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొంటాయ. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. 23న కోల్‌కతాలో జరిగే ఎలిమినేటర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడతాయ. ఇందులో ఓడిన జట్టు నిష్క్రమిస్తే, గెలిచిన జట్టుతో మొదటి క్వాలిఫర్‌లో గెలిచిన జట్టు 25న కోల్‌కతాలోనే రెండో క్వాలిఫయర్ ఆడుతుంది. అందులో విజయాన్ని నమోదు చేసిన జట్టు ఈనెల 27న ముంబయలో జరిగే ఫైనల్‌లో ఢీ కొంటాయ.