క్రీడాభూమి

మళ్లీ నాదల్ నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 21: రాఫెల్ నాదల్ మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్‌ను అధిరోహించాడు. రోమ్‌లో జరిగిన ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా ప్రపంచ ర్యాంకింగ్‌లో మళ్లీ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ గెలుపు త్వరలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ మరింత దూసుకుపోయేందుకు ఉపకరిస్తుంది. రోమ్ మాస్టర్ టైటిల్‌లో విజయంతో నాదల్ రోజర్ ఫెదరర్‌ను వెనక్కు నెట్టాడు. ప్రపంచ మాజీ నెంబర్ వన్ నవోక్ జొకోవిచ్ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు దిగజారి 22 ర్యాంక్‌లో నిలిచాడు. ఏటీపీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రాఫెల్ నాదల్ అత్యధికంగా 8770 పాయింట్ల అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో రోజర్ ఫెదరర్ 8,670 పాయింట్లతో ఉన్నాడు. నవోక్ జొకోవిచ్ 1,665 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచాడు.
థాయిలాండ్ ఓపెన్.. భారత జోడీకి కాంస్యం
న్యూఢిల్లీ, మే 21: థాయిలాండ్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీ జి.సత్తియన్, సునీల్ శెట్టి కాంస్య పతకం గెల్చుకున్నారు. ఓపెనింగ్ రౌండ్‌లో తొలుత జపాన్ జోడీని 3-1, మలేషియా జోడీని 3-0 తేడాతో ఓడించిన భారత జోడీ సెమీఫైనల్స్‌లో చోటుదక్కించుకున్నారు. సెమీస్‌లో భారత్‌కు చెందిన మరో జోడీ హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్‌ను 3-2తో ఓడించారు. ఫైనల్స్‌లో జర్మనీ జోడీ టోబియాస్ హిప్లర్, కిలియన్ ఓర్ట్‌ను తొలి గేమ్‌లో 11-9తో ఓడించి సత్తియన్, సునీల్ శెట్టి మిగిలిన మూడు రౌండ్లలో 12-14, 9-11, 7-11తో ఓటమి చెంది కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.