క్రీడాభూమి

టెస్టులో చోటు మరో అనుభవం *క్రికెటర్ జోష్ బట్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 21: లండన్‌లోని లార్డ్స్ మైదానంలో పాకిస్తాన్‌తో గురువారం నుంచి జరిగే తొలి టెస్టుమ్యాచ్‌లో మళ్లీ చోటు దక్కడం మరో అనుభవం వంటిదని ఇంగ్లాండ్ క్రికెటర్ జోష్ బట్లర్ అన్నాడు. 2016 డిసెంబర్‌లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆడిన తర్వాత మళ్లీ ఇలాంటి అవకాశం రావడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అత్యధికంగా రెండుసార్లు 90 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించడం పాక్‌తో జరిగే టెస్టు క్రికెట్‌లో మళ్లీ బట్లర్‌కు చోటు దక్కడానికి హేతువైంది. లార్డ్స్ మైదానంలో గురువారం నుంచి జరిగే రెండు టెస్టు సిరీస్‌లలో ఏడో బ్యాట్స్‌మన్‌గా బట్లర్ బరిలోకి దిగనున్నాడు. మళ్లీ టెస్టు క్రికెట్‌లో చోటు దక్కడం ఆశ్చర్యకరమైన, అరుదైన అంశమని, ఇందులో తన సత్తా ఏమిటో నిరూపిస్తానని ఆయన పేర్కొన్నాడు.