క్రీడాభూమి

నేడు మహిళల ఎగ్జిబిషన్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో మహిళా క్రికెట్‌లోనూ మార్గం సుగమం చేసుకునేందుకు వీలుగా మంగళవారం మహిళల టీ-20 మ్యాచ్‌ను మంగళవారం ముంబయి వాంఖడే స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇదే స్టేడియంలో ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి ఏడు గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్ కంటే ముందుగానే మహిళల టీ-20 లీగ్‌ను నిర్వహించనున్నారు. ఐపీఎల్ ఎగ్జిబిషన్‌గా పరిగణించే ఈ లీగ్ రెండు టీమ్‌లలో ఐపీఎల్ ట్రయల్ బ్లేజర్ టీమ్‌కు భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, ఐపీఎల్ సూపర్ మోవా టీమ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో మన దేశానికి చెందిన క్రికెటర్లతోపాటు పలువురు అగ్రశ్రేణి క్రికెటర్లు కివీకి చెందిన సుజీ బేట్స్, ఆస్ట్రేలియాకు చెందిన అలైస్సా హీలే, బెత్ మూనే, ఎలైసీ పెర్రీ, మెగాన్ స్టట్, ఇంగ్లాండ్‌కు చెందిన డేనియల్లీ వైట్ వంటివారు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీఎల్ తరహా ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించేందుకు అంగీకరించినందుకు బీసీసీఐకి పలువురు క్రికెటర్లు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తాము చక్కని ఆటతీరును ప్రదర్శిస్తామని స్మృతి మంధాన తెలిపింది. మహిళా క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రతిఒక్కరూ మంచి ప్రదర్శనను కనబరచేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆమె పేర్కొంది. ్రఇలాంటి అరుదైన, చరిత్రాత్మక ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారన్నది నూటికి నూరుపాళ్లు వాస్తవమని ఆమె తెలిపింది.