క్రీడాభూమి

ఫైనల్‌కు చెన్నై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 22: ఐపీఎల్ తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం నమోదు చేసింది. ఆఖరి ఓవర్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఫప్ డుప్లెసిస్ చివరి వరకూ నాటౌట్‌గా నిలిచి తమ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. చెన్నై 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేయగా, హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్‌ను ఎంచుకుంది. తొలి క్వాలిఫయర్‌లో ఓటమిని ఎదుర్కొన్న హైదరాబాద్ ఎలిమినేటర్‌లో గెలుపొందిన టీమ్‌తో తమ తదుపరి మ్యాచ్‌లో తలపడుతుంది.
టాస్ గెలిచిన చెన్నై ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన సన్‌రైజర్స్ జట్టులో తొలి ఓవర్, తొలి బంతికే స్టయిలిష్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ బౌల్డ్ అయ్యాడు. దీపక్ చహర్ చేతిలో ధావన్ బౌల్డ్ అయి, నిరాశపరిచాడు. రెండో ఓపెనర్‌గా దిగిన వికెట్ కీపర్ శ్రీవాత్స గోస్వామి తొమ్మిది బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 12 పరుగులు చేసి లుంగీ ఎన్గిడి బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ సిక్సర్లు, బౌండరీల మెరుపులతో అలరించి, ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత వహించిన కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ ఇన్నింగ్ ఆడలేకపోయాడు. 15 బంతులు ఎదుర్కొన్న విలియమ్‌సన్ నాలుగు బౌండరీలతో 24 పరుగులు చేసి ఎస్.ఎన్.్ఠకూర్ బౌలింగ్‌లో ఎం.ఎస్.్ధనీకి క్యాచ్ ఇచ్చాడు.
షాకీబ్ ఆల్ హసన్ 10 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 12 పరుగులు చేసి డీజే బ్రేవో బౌలింగ్‌లో ఎం.ఎస్.్ధనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. మనీష్ పాండే 16 బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. యూసుఫ్ పఠాన్ 29 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతో 24 పరుగులు చేసి డీజే బ్రేవో బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. భువనేశ్వర్ కుమార్ 11 బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసి ఎం.ఎస్.్ధనీ చేతిలో రనౌట్ అయ్యాడు. కార్లోస్ బ్రాత్‌వైట్ 29 బంతులు ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, ఒక బౌండరీతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్‌లో ఇతనిదే అత్యధిక స్కోరు.
చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రేవో నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. దీపక్ చాహర్ నాలుగు ఓవర్లలో 31, లుంగీ ఎన్గిడి నాలుగు ఓవర్లలో 20, శార్దూల్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో 50, రవీంద్ర జడేజా నాలుగు ఓవర్లలో 13 పరుగులిచ్చి చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 140 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై ఇంకా ఐదు పరుగులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. షేన్ వాట్సన్ ఐదు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో గోస్వామికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. సురేష్ రైనా 13 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లతో 22 పరుగులు చేసి సిద్ధార్థ కౌల్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. అంబటి రాయుడు ఒక బంతిని ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే సిద్ధార్థ కౌల్ చేతికి దొరికిపోయాడు. వికెట్ కీపర్/కెప్టెన్ ఎం.ఎస్.్ధనీ 18 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో తొమ్మిది పరుగులు చేసి రషీద్ ఖాన్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. డ్వేన్ బ్రేవో 11 బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు.
ఐదు బంతులు ఎదుర్కొన్న రవీంద్ర జడేజా మూడు పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. దీపక్ చహర్ ఆరు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 10 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. హర్బజన్ సింగ్ తొమ్మిది బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ ఐదు బంతులు ఎదుర్కొని 15, ఫఫ్ డుప్లెసిస్ 42 బంతులు ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ మూడు ఓవర్లలో 30 పరుగులు, సిద్ధార్థ కౌల్ నాలుగు ఓవర్లలో 32, రషీద్ ఖాన్ నాలుగు ఓవర్లలో 11 పరుగులిచ్చి తలో రెండు వికెట్లు తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్ 3.1 ఓవర్లలో 14 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు.
జట్ల సంక్షిప్త స్కోరు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 (కార్లోస్ బ్రాత్‌వైట్ నాటౌట్ 43, కేన్ విలియమ్‌సన్ సి ధోనీ బి ఎస్.ఎన్.్ఠకూర్ 24, యూసుఫ్ పఠాన్ సి అండ్ బి డ్వేన్ బ్రేవో 24, డ్వేన్ బ్రేవో 2/25)
చెన్నై సూపర్ కింగ్స్: 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 140 (్ఫఫ్ డుప్లెసిస్ నాటౌట్ 67, సురేష్ రైనా బౌల్డ్ సిద్ధార్థ కౌల్ 22, రషీద్ ఖాన్ 2/11, సందీప్ శర్మ 2/30, సిద్ధార్థ కౌల్ 2/32).