క్రీడాభూమి

శరత్ కమల్, వౌమా దాస్‌కు రియో ఒలింపిక్ బెర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, ఏప్రిల్ 16: భారత వర్థమాన టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్‌తో పాటు వౌమా దాస్ రియో ఒలింపిక్స్‌కు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. హాంకాంగ్‌లో శనివారం వీరు స్టేజ్-2 ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ ఫైనల్ రౌండ్లలో తమతమ ప్రత్యర్థులపై విజయం సాధించడంతో ఒలింపిక్ బెర్తులు ఖరారయ్యాయి. నాలుగేళ్ల క్రితం లండన్‌లో నిరాశకు గురవడంతో పాటు మూడు రోజుల క్రితం దక్షిణాసియా జోన్ క్వాలిఫయర్స్‌లో మూడో స్థానంతో సరిపుచ్చుకున్న శరత్ కమల్ శనివారం హాంకాంగ్‌లోని క్వీన్ ఎలిజబెత్ స్టేడియంలో జరిగిన నిర్ణాయక పురుషుల సింగిల్స్ ఫైనల్ రౌండ్ పోటీలో విజృంభించి పోరాడాడు. ఈ పోరులో శరత్ కమల్ 4-3 (12-14, 11-6, 3-11, 7-11, 11-4, 11-7, 11-6) గేముల తేడాతో ఇరాన్‌కు చెందిన నొషాద్ అలామియాను ఓడించి ఒలింపిక్ బెర్తును దక్కించుకున్నాడు.
కాగా, మహిళల సింగిల్స్ ఫైనల్ రౌండ్‌లో వౌమా దాస్ శనివారం ఉదయం వరుస గేముల్లో (3-11, 9-11, 10-12, 5-11) దక్షిణ కొరియా క్రీడాకారిణి రీ మియాంగ్ సన్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ పరాజితుల మధ్య జరిగిన ఫైనల్ (లాసర్స్ ఫైనల్)లో అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగింది. ఈ పోరులో ఆమె 4-1 (11-13, 11-9, 13-11, 11-7, 12-10) గేమల తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన రిమ్మా గఫ్రనోవాను ఓడించి రియో బెర్తును కైవసం చేసుకుంది. వౌమా ఒలింపిక్స్‌లో పాల్గొననుండటం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆమె 2004లో గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో శరత్‌తో కలసి పోటీపడింది. కాగా, ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమయ్యే రియో ఒలింపిక్ క్రీడలల్లో పాల్గొనేందుకు సౌమ్యజిత్ ఘోష్, మేనకా బాత్రా ఇప్పటికే అర్హత సాధించారు. వాస్తవానికి ఒలింపిక్ క్రీడల్లో పురుషులు, మహిళల సింగిల్స్ ఈవెంట్లకు జాతీయ ఒలింపిక్ కమిటీ గరిష్ఠంగా ఇద్దరు క్రీడాకారులను మాత్రమే అనుమతించేందుకు వీలుంది. అయితే ఈసారి రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిసారి నలుగురు సభ్యులతో కూడిన పూర్తిస్థాయి టేబుల్ టెన్నిస్ జట్టు ప్రాతినిధ్యం వహించనుంది.