క్రీడాభూమి

గగన్ నారంగ్ సారథ్యంలో 135 మంది యువ షూటర్లకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, మే 22: దేశవ్యాప్తంగా మేటి యువ షూటర్‌లను ఎంపిక చేసి వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణనిచ్చి అన్నివిధాల తీర్చిదిద్దేందుకు గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ (జీఎన్‌ఎస్‌పీఎఫ్) కృషి చేస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా యువ షూటర్‌లకు మెరుగైన శిక్షణనిచ్చి 2024 ఒలింపిక్స్‌లో కనీసం పది మంది షూటర్‌లు పతకాలు సాధించే దిశగా భారత షూటర్ గగన్ నారంగ్ నడుంబిగించాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రావీణ్యం కనపరుస్తున్న షూటర్‌లను ఎంపిక చేసి వారికి శిక్షణనిస్తోంది జీఎన్‌ఎస్‌పీఎఫ్. ఫౌండేషన్ స్థాపించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రెండో సంవత్సరంలో కూడా శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగించాలని, దేశ వ్యాప్తంగా 176 మంది యువషూటర్‌లలో 130 మందిని ఫౌండేషన్ ఎంపికచేసింది. విదేశీ కోచ్‌లతో యువ షూటర్స్‌కు శిక్షణనిస్తున్నారు.