క్రీడాభూమి

శెభాష్ కుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 24: ఇంతవరకు తన పేరిట ఉన్న 153 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రికార్డును సమం చేసినందుకు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అలన్ బోర్డర్ ఇంగ్లాండ్ క్రికెటర్ అలస్టెయిర్ కుక్‌కు అభినందనలు తెలిపాడు. గురువారం ఇక్కడి లార్డ్స్ మైదానంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో కుక్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అలన్ బోర్డర్ ఇంతవరకు తన క్రికెట్ క్రీడా జీవితంలో 153 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇపుడు తన రికార్డును కుక్ సమం చేయడంతోపాటు 154వ టెస్టు మ్యాచ్‌లో ఆడడుతున్నందుకు ఆయన అభినందనలు తెలిపాడు. 2006లో నాగ్‌పూర్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అలాస్టెయిర్ కుక్ సెంచరీ నమోదు చేశాడు. ఆ సమయంలో కుక్ ఆరోగ్యం సహకరించకున్నా సెంచరీ కొట్టడం అప్పట్లో సంచలన వార్త అయింది.
అలన్ బోర్డర్, అలస్టెయిర్ కుక్ ఇద్దరూ ఎడమచేతివాటం బ్యాట్స్‌మెనే్ల. వీరిద్దరూ ఆయా దేశాల తరఫున ఆడిన యాషెష్ సిరీస్‌లను విజయవంతం చేయడంతోపాటు టెస్టులలో 11 వేలకు పైగా పరుగులు సాధించిన రికార్డును తమ ఖాతాల్లో నమోదు చేసుకున్నారు. ఎస్సెక్స్‌తోపాటు కౌంటీ చాంపియన్‌షిప్ టైటిళ్లను సైతం వారు సొంతం చేసుకున్నారు. అయితే, అలన్ బోర్డర్ కంటే కుక్ ఐదేళ్ల ముందుగానే 33 ఏళ్ల ప్రాయంలో 153 టెస్టు మ్యాచ్‌లు ఆడి అతని రికార్డును సమం చేశాడు.

చిత్రం..అలన్ బోర్డర్