క్రీడాభూమి

ఇంగ్లాండ్‌కు 76 పరుగుల ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్, మే 26: ఇక్కడి లార్డ్స్ మైదానంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ ఆట 76 ఓవర్లు ఆడేటప్పటికి ఆరు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి, 76 పరుగుల ఆధిక్యంతో ఉంది. ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 114.3 ఓవర్లలో 363 పరుగులకు ఆలౌట్ అయింది. అజర్ 136 బంతుల్లో 50, ఇమామ్ ఉల్ హక్ 16 బంతుల్లో నాలుగు, హరీస్ సొహైల్ 95 బంతుల్లో 39, అసద్ షాఫిక్ 100 బంతుల్లో 59, బాబర్ అజామ్ 120 బంతుల్లో 68, సర్ఫ్‌రాజ్ అహ్మద్ 24 బంతుల్లో తొమ్మిది, షాదాబ్ ఖాన్ 85 బంతుల్లో 52, ఫహీమ్ అష్రాఫ్ 38 బంతుల్లో 37, మహ్మద్ అబ్బాస్ 26 బంతుల్లో ఐదు పరుగులు చేశారు. మహ్మద్ అమీర్ 46 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్, బెన్ స్టోక్స్‌లకు మూడు వికెట్లు దక్కాయి. మార్క్ ఉడ్‌కు రెండు, స్టువర్ట్ బ్రాడ్‌కు ఒక వికెట్ లభించాయి.
అనంతరం మూడో రోజు శనివారం ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆట 76 ఓవర్లు సరికి ఆరు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. అలాస్టర్ కుక్ 10 బంతులు ఎదుర్కొని ఒక పరుగు, మార్క్ స్టోన్‌మాన్ 45 బంతులు ఎదుర్కొని తొమ్మిది, కెప్టెన్ జో రూట్ 120 బంతులు ఎదుర్కొని 58, డేవిడ్ మలాన్ 50 బంతులు ఎదుర్కొని 12, బెన్ స్టోక్స్ 10 బంతులు ఎదుర్కొని తొమ్మిది పరుగులు చేశారు. జానీ బెయిర్‌స్టోవ్ రెండు బంతులు ఎదుర్కొని బౌల్డ్ అయ్యాడు. జోస్ బట్లర్ 66, డొమినిక్ బెస్ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో మహ్మద్ అమీర్, మహ్మద్ అబ్బాస్, షాకీబ్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.