క్రీడాభూమి

అందులో ఆశ్చర్యమేముంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 26: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్, మరోపక్క ఫీల్డింగ్‌లో ఇలా మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరడానికి కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై ఎంతోమంది ప్రశంసల జల్లులు కురిపిస్తున్నా ఇందులో ఆశ్చర్యమేముందని ఇదే జట్టు క్రికెటర్ యూసుఫ్ పఠాన్ వ్యాఖ్యానించాడు. రషీద్ ప్రపంచవ్యాప్తంగా ఆడిన ఎన్నో టోర్నమెంట్లలో ఇలాంటి ఘనతలను ఎన్నో సాధించాడని, ఇపుడు కోల్‌కతాపై చూపిన తెగువ గొప్పదైనా, తమ జట్టు సభ్యులమంతా దీనిలో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముందని భావిస్తున్నామని ఆయన అన్నాడు. రషీద్ ఇదివరకు ఆడిన పలు మ్యాచ్‌లలో చాలాసార్లు సిక్సర్లు, ఫోర్లు చేసి దాదాపు 20 నుంచి 30 వరకు పరుగులు త్వరితగతిన చేసిన విషయాన్ని పఠాన్ గుర్తు చేస్తూ ఇంతకుముందే ఈ ఘనతను అందుకున్నాడని పేర్కొన్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 150 పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతున్న సమయంలో ఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన రషీద్ ఖాన్ 10 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేయడంతో జట్టు ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయడంతోపాటు ప్రత్యర్థిపై 14 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా కెప్టెన్ తమ టీమ్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (2/29), సునీల్ నరైన్ (1/24)లను సన్‌రైజర్స్‌పైకి ప్రయోగించి కొంతవరకు విజయం సాధించినా, దీనిని గమనించిన రషీద్ ఖాన్ తన ఆటతీరును అమాంత మార్చేశాడని, అతనికి అలాంటి సత్తా ఉందని అన్నాడు. రషీద్ ఆటతీరుపై తమకు ఎప్పుడూ ఎలాంటి అనుమానం లేదని ఆయన అన్నాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తుదిపోరులో తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శించి ఉత్తమ ఆటతీరును కనబరచడం ద్వారా ఘన విజయాన్ని నమోదు చేస్తామనే ధీమా ఉందని ఆయన పేర్కొన్నాడు.