క్రీడాభూమి

ప్రియురాలు రివా సోలంకీతో నేడు జడేజా పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, ఏప్రిల్ 16: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో గుజరాత్ లయన్స్ జట్టుకు సేవలు అందిస్తున్న టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆదివారం రాజ్‌కోట్‌లో తన ప్రియురాలు రివా సోలంకీకి మూడుముళ్లు వేయనున్నాడు. దీంతో అతను శనివారం ముంబయి ఇండియన్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆదివారం రివా సోలంకీని వివాహం చేసుకోనున్న జడేజా గుజరాత్ లయన్స్ జట్టు సభ్యులతో కలసి ముంబయికి రాలేదని, శనివారం అతను ఆడటం లేదని ఆ జట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా జడేజా అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది కచ్చితంగా తెలియదని, అయితే ఈ మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరుగనుండటంతో జడేజా పాల్గొనే అవకాశాలు లేకపోలేదని వారు చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఈ ఏడాది కొత్తగా ప్రవేశించిన గుజరాత్ లయన్స్ జట్టు ఇప్పటివరకూ ఆడి రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించి మంచి జోరుమీద ఉంది. ఆ జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకడైన జడేజా రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చక్కగా రాణించి 18 పరుగులకు రెండు వికెట్లు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం జడేజా వివాహ విందు (రిసెప్షన్) కార్యక్రమానికి గుజరాత్ లయన్స్ సభ్యులంతా హాజరవుతారని భావిస్తున్నట్లు ఆ జట్టు అధికారులు తెలిపారు. ఇదిలావుంటే, రివాను పెళ్లాడబోతున్న జడేజాకు ఆమె తల్లిదండ్రులు ఇప్పటికే సరికొత్త ‘ఆడీ క్యూ-7’ కారును బహుమతిగా ఇచ్చారు. దీని ధర దాదాపు 95 లక్షల రూపాయలు ఉంటుంది.

chitram నిశ్చితార్థంలో ఉంగరాలు మార్చుకుంటున్న
రివా సోలంకీ, రవీంద్ర జడేజా (ఫైల్ ఫొటో)