క్రీడాభూమి

మలింగకు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఏప్రిల్ 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగకు ఆ దేశ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మలింగ వైద్య పరమైన అనుమతి పొందకుండా బోర్డు ఆదేశాన్ని ధిక్కరించి ఐపిఎల్‌లో ఆడుతుండటమే ఇందుకు కారణం. ఈ విషయపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ మలింగకు బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేసిందని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) వర్గాలు ధ్రువీకరించాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు మలింగకు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ అతను శుక్రవారం ముంబయి ఇండియన్స్ జట్టులో చేరడంతో పాటు ఆ జట్టు శిక్షణా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. ఫిబ్రవరిలో ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి మలింగకు, శ్రీలంక క్రికెట్ బోర్డు నూతన పాలక మండలికి మధ్య వివాదం కొనసాగుతోంది. దీంతో గత నెల ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నీ ప్రారంభానికి ముందు శ్రీలంక జట్టు సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాలని మలింగకు బోర్డు పాలక మండలి స్పష్టం చేసింది. ఆ తర్వాత ప్రపంచ కప్ టి-20 టోర్నీకి ఎంపిక చేసిన శ్రీలంక జట్టులో ఆటగాడిగా మలింగకు చోటు కల్పించినప్పటికీ ఫిట్నెస్ సమస్యలను సాకుగా చూపి అతను ఈ కీలక టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో ఈ టోర్నీలో శ్రీలంక జట్టు తమ ప్రధాన బౌలర్ లేకుండానే ఆడాల్సి వచ్చింది. టి-20 ప్రపంచ కప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన శ్రీలంక జట్టు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడానికి దారితీసిన ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. దీంతో ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నానని మలింగ చెప్పిన కారణాలపై అనుమానాలు తలెత్తడంతో ఐపిఎల్ తొమ్మిదో ఎడిషన్‌లో పాల్గొనడానికి ముందు అతను ఫిట్నెస్‌ను రుజువు చేసుకోవాలని శ్రీలంక సెలెక్షన్ కమిటీ చైర్మన్ అరవింద డిసిల్వా పట్టుబట్టాడు. దీంతో శ్రీలంక బోర్డు ఉన్నతాధికారులపై మలింగ ఆగ్రహంతో ఉన్నాడని ఎస్‌ఎల్‌సి వర్గాలు తెలిపాయి.

లారెస్ అవార్డుల రేసులో మెస్సీ, బోల్ట్

బెర్లిన్, ఏప్రిల్ 17: ఇక్కడ సోమవారం ప్రదానం చేయనున్న ప్రతిష్ఠాత్మక లారెస్ ప్రపంచ స్పోర్ట్స్ అవార్డులను దక్కించుకోవడానికి సాకర్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ, స్ప్రింట్ రారాజు ఉసోన్ బోల్ట్ మొదలుకొని వివిధ క్రీడలకు చెందిన పలువురు క్రీడాకారులు, క్రీడాకారిణులు పోటీ పడుతున్నారు. ‘ఆస్కార్స్ ఆఫ్ స్పోర్ట్స్’గా పిలవబడే ఈ అవార్డులు ఒక పురుషుల విభాగంలోనే కాకుండా మహిళలు, టీం తదితర కేటగిరీల్లో కూడా ప్రదానం చేస్తున్నారు. పురుషుల విభాగంలో మూడుసార్లు ఈ అవార్డును దక్కించుకున్న బోల్ట్, అయిదు సార్లు ఫుట్‌బాల్‌లో ఉత్తమ ఆటగాడు అవార్డు దక్కించుకున్న మెస్సీతో పాటు టెన్నిస్ నంబర్ వన్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్, మూడు సార్లు ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ తదితర క్రీడా దిగ్గజాలు పోటీ పడుతున్నారు. ఇక మహిళల విభాగంలో టెన్నిస్ క్వీన్ సెరీనా విలియమ్స్, ట్రాక్‌అండ్ ఫీల్డ్ రంగంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న షెల్లీ-ఆన్ ఫ్రేజర్ మరోసారి ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ప్రపంచ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం చాంపియన్స్‌లీగ్ టైటిల్ విజేత బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్, ప్రపంచ రగ్బీ చాంపియన్స్ ఆల్ బ్లాక్స్‌తో పాటుగా ఎఎంజి పెట్రోనాస్ ఫార్ములా వన్ టీమ్, ఎన్‌బిఏ చాంపియన్స్ గోల్డెన్ స్టేట్ వారియర్స్, బ్రిటీష్ డేవిస్ కప్ టీమ్, మూడోసారి ప్రపంచ కప్‌ను గెలుచుకున్న అమెరికా మహిళా ఫుట్‌బాల్ జట్టు పోటీ పడుతున్నాయి.