క్రీడాభూమి

డీకాక్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ సత్తా చాటుకుంది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును సొంత మైదానంలో మట్టికరిపించి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు రాబట్టగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించి ప్రస్తుత సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడి 51 బంతుల్లో 108 పరుగులు సాధించిన డెవిల్స్ ఓపెనర్ క్వింటోన్ డీకాక్ తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ పరుగుల ఖాతా ఆరంభించకుండానే ఓపెనర్ క్రిస్ గేల్ (0) వికెట్‌ను చేజార్చుకుంది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఎబి.డివిలియర్స్ క్రీజ్‌లో నిలదొక్కుకుని స్కోరు బోర్డును ముందుకు నడిపారు. డెవిల్స్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించిన వీరు చూడముచ్చటైన షాట్లతో అలరిస్తూ చెరొక అర్థ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు 107 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. అనంతరం డివిలియర్స్ (33 బంతుల్లో 55 పరుగులు) కార్లోస్ బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో మహమ్మద్ షమీకి దొరికిపోవడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత షేన్ వాట్సన్ (19 బంతుల్లో 33 పరుగులు)తో కలసి మూడో వికెట్‌కు మరో 63 పరుగులు జోడించిన కోహ్లీ 48 బంతుల్లో 79 పరుగులు సాధించి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇవ్వగా, అతని స్థానంలో వచ్చిన సర్‌ఫ్రాజ్ ఖాన్ (1) రనౌట్‌గా నిష్క్రమించాడు. చివర్లో వికెట్ కీపర్ కేదార్ జాదవ్ (9), డేవిడ్ వైస్ (5) అజేయంగా నిలవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది.
అనంతరం 192 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ (0)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ (9) విఫలమైనప్పటికీ ఓపెనర్ క్వింటోన్ డీకాక్ ధాటిగా ఆడాడు. క్రీజ్‌లో పాతుకుపోయి ఎడాపెడా షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన అతను స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. కేవలం 51 బంతుల్లో 3 సిక్సర్లు, మరో 15 ఫోర్ల సహాయంతో 108 పరుగులు సాధించిన డీకాక్ 18వ ఓవర్‌లో వాట్సన్ వేసిన రెండో బంతిని ఎదుర్కోబోయి వికెట్ల వెనుక కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ (42 బంతుల్లో 54 పరుగులు), జెపి.డుమినీ (5 బంతుల్లో 7 పరుగులు) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేయడంతో 19.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 192 పరుగులు సాధించిన డేర్‌డెవిల్స్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే రాయల్ చాలెంజర్‌కు షాక్ ఇచ్చింది. ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన రాయల్ చాలెంజర్స్‌కు ఇది తొలి ఓటమి.
సంక్షిప్తంగా స్కోర్లు
రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 191/5 (విరాట్ కోహ్లీ 79, ఎబి.డివిలియర్స్ 55, షేన్ వాట్సన్ 33, కేదార్ జాదవ్ 9-నాటౌట్, డేవిడ్ వైజ్ 5-నాటౌట్). వికెట్ల పతనం: 1-0-, 2-107, 3-170, 4-172, 5-177. బౌలింగ్: మహమ్మద్ షమీ 4-0-34-2, జహీర్ ఖాన్ 4-0-50-1, కార్లోస్ బ్రాత్‌వైట్ 2-0-18-1, క్రిస్ మోరిస్ 4-0-29-0, పవన్ నేగీ 3-0-26-0, అమిత్ మిశ్రా 3-0-26-0.
డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: 19.1 ఓవర్లలో 193/3 (క్వింటోన్ డీకాక్ 108, కరుణ్ నాయర్ 54-నాటౌట్, సంజూ శాంసన్ 9, జెపి.డుమినీ 7-నాటౌట్). వికెట్ల పతనం: 1-11, 2-50, 3-184.
బౌలింగ్: షేన్ వాట్సన్ 4-0-25-2, శ్రీనాథ్ అరవింద్ 3-0-32-1, పర్వెజ్ రసూల్ 3-0-28-0, యుజ్వేంద్ర చాహాల్ 2.1-0-23-0, డేవిడ్ వైజ్ 4-0-49-0, హర్షల్ పటేల్ 3-0-32-0.

‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’
క్వింటోన్ డీకాక్ (108 పరుగులు)