క్రీడాభూమి

సాకర్ వరల్డ్ కప్ ట్రివియా బ్రెజిల్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాకర్ రంగంలో బ్రెజిల్‌కు విశిష్ట స్థానం ఉంది. ఈ జట్టు ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. ఇటలీ, జర్మనీ నాలుగు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్నాయి. అదేవిధంగా ఉరుగ్వే, అర్జెంటీనా చెరి రెండుసార్లు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు చెరొకసారి చాంపియన్లుగా నిలిచాయి. ప్రపంచకప్ సాకర్‌లో బ్రెజిల్‌కు మరో రికార్డు కూడా ఉంది. ఈ జట్టు 1930 నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా ప్రతి ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌లోనూ, అంటే 18 సార్లు పాల్గొంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరిగే పోటీల్లో, 19వ సారి ప్రపంచకప్ ఆడనుంది.
ఆతిథ్యమిచ్చి.. టైటిల్ గెలిచి..
ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చిన దేశం టైటిల్ అందుకున్న సంఘటనలు ఆరు ఉన్నాయి. 1930లో మొదటి వరల్డ్ కప్ పోటీలకు వేదికైన ఉరుగ్వే టైటిల్ అందుకుంది. అదేవిధంగా 1934 ఇటలీ, 1966లో ఇంగ్లాండ్, 1974లో అప్పటి పశ్చిమ జర్మనీ, 1978లో అర్జెంటీనా, 1998లో ఫ్రాన్స్ వరల్డ్ కప్‌ను నిర్వహించి, విజేతగా నిలిచి సత్తాచాటాయి. ఆతిథ్య దేశం దారుణంగా విఫలం కావడం 2010లో చోటుచేసుకుంది. కనీవినీ ఎరుగని రీతిలో అట్టహాసంగా ఈ పోటీలను నిర్వహించిన దక్షిణాఫ్రికా 17వ స్థానంతో టోర్నీని ముగించింది. ఇలావుంటే, మొదటి వరల్డ్ కప్‌కు 1930లో వేదికైన ఉరుగ్వే, 1934లో గైర్హాజరైంది. ఒక డిఫెండింగ్ చాంపియన్ తర్వాతి పోటీల్లో బరిలోకి దిగకపోవడం అదే మొదటిసారి. అప్పటినుంచి ఇప్పటివరకూ అలాంటి సంఘటన చోటుచేసుకోలేదు. కాగా, చాంపియన్‌గా నిలిచి, నాలుగేళ్ల తర్వాత మళ్లీ పోటీల్లో పాల్గొన్నప్పటికీ దారుణంగా విఫలమైన జట్టు ఇటలీ, బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్. 1950లో తిరిగి 2010లో ఇటలీ, 1966లో బ్రెజిల్, 2002లో ఫ్రాన్స్, 2014లో స్పెయిన్ డిఫెండింగ్ చాంపియన్లుగా ఆడుతూ, గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి.
మొదటి రౌండ్‌కే పరిమితం!
స్కాట్‌లాండ్ మొత్తం ఎనిమిది పర్యాయాలు వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌కు క్వాలిఫై అయింది. కానీ, ఏ ఒక్కసారి కూడా మొదటి రౌండ్‌ను అధిగమించలేకపోయింది. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌కు మూడుసార్లు వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం లభించింది. కానీ, స్కాట్‌లాండ్ మాదిరిగానే మొదటి రౌండ్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. బొలీవియా, హోండురాస్ జట్లు మూడేసిసార్లు ఒక్క మ్యాచ్‌ను కూడా గెల్చుకోకుండానే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాయి.

క్రేజీ ట్రోఫీ..
క్రీడా ప్రపంచంలో మరే ఇతర ట్రోఫీకి లేని విపరీతమైన క్రేజీ ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీకి ఉంది. 1930 నుంచి 1970 విజేత జట్టుకు బహూకరించిన ట్రోఫీని పూర్తిగా జర్మనీ హస్తకళలను ప్రతిబింబించేదిగా రూపొందించారు. తొలుత దీనిని ప్రపంచకప్‌గా వ్యవహరించినా, 1946లో ఫిఫా మాజీ అధ్యక్షుడు జూలెస్ రెమెట్ పేరుతో ట్రోఫీని అందించడం ఆనవాయితీగా మారింది. 1970లో బ్రెజిల్ మూడోసారి విశ్వవిజేతగా నిలవడంతో, నిబంధనలను అనుసరించి, అప్పటివరకు రోలింగ్ ట్రోఫీగా ఉన్న జూలెస్ రెమెట్ ట్రోఫీకి శాశ్వత హక్కుదారైంది. కానీ, 1983లో బ్రెజిల్ నుంచి ఈ ట్రోఫీని గుర్తుతెలియని వ్యక్తులు తస్కరించారు. ఇప్పటివరకు దాని జాడ కనిపించలేదు. బహుశా దొంగలు దానిని కరిగించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బ్రెజిల్ శాశ్వత హక్కుదారు కావడంతో 1970లో ఫిఫా ప్రపంచకప్ పేరుతో కొత్త ట్రోఫీని తయారు చేయాల్సి వచ్చింది. ఏడు దేశాల నుంచి వచ్చిన నిపుణులు మొత్తం 53 నమూనాలను ఫిఫాకు సమర్పించారు. అనేక సమావేశాలు, సంప్రదింపులు, తర్జనభర్జనల తర్వాత, ఇటలీ డిజైనర్ సిల్వియో గాజానిగా తయారు చేసిన మోడల్‌ను ఫిఫా ట్రోఫీగా ఎంపిక చేశారు. దీని ఎత్తు 36 సెంటీ మీటర్లు. 6.17 కిలోల బరువు ఉండే ఈ ట్రోఫీని 18 క్యారెట్ బంగారంతో తయారు చేశారు. ట్రోఫీ కింద భాగంలో ఉన్న దిమ్మెపై 1974 నుంచి విజేత జట్ల పేర్లను చెక్కారు. విజేత జట్టు నాలుగేళ్ల పాటు ఈ ట్రోఫీని ఉంచుకోవచ్చు. మరో ప్రపంచకప్ చాంపియన్‌షిప్ ప్రారంభం నాటికి దానిని ఫిఫా తిరిగి తీసుకుంటుంది. అదే స్థానంలో అదే నమూనాతో తయారు చేసిన మరో ట్రోఫీని ఆ జట్టుకు అంద చేస్తుంది.