క్రీడాభూమి

మిథాలీ రాజ్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, జూన్ 7: అంతర్జాతీయ టీ-20ల్లో భారత్ జట్టు తరపున ఆడి రెండు వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీరాజ్ రికార్డు సృష్టించింది. మహిళల ఆసియా కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ 23 బంతుల్లో 33 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ పరుగులతో కలుపుకుని అంతర్జాతీయ టీ-20 క్రికెట్ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు 2015 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ-20ల్లో ఇప్పటివరకు 1983 పరుగులు చేశాడు. దీంతో పోలిస్తే కోహ్లీ కంటే అధికంగా పరుగులు సాధించిన మిథాలీ అగ్రస్థానంలో నిలిచింది. రెండు వేల పరుగులు పూర్తి చేసిన వారిలో ఇప్పటికి ఆరుగురు ఉండగా మిథాలీ రాజ్ 7వ స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ కార్లోత్ ఎడ్వర్డ్ 2605 పరుగులతో మొదటి స్థానంలో నిలవగా, మహిళా క్రికెట్ వనే్డల్లో మిథాలీ రాజ్ అత్యధిక అర్ధ సెంచరీలు సాధించి రికార్డును సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ మాజీ క్రికెటర్ ఎడ్వర్డ్ నెలకొల్పిన 55 అర్ధ సెంచరీల రికార్డును మిథాలీ అధిగమించిన విషయం విదితమే.
అండర్-19 శ్రీలంక టూర్..
అర్జున్ తెండూల్కర్‌కు చోటు
న్యూఢిల్లీ, జూన్ 7: శ్రీలంకలో వచ్చేనెల ప్రారంభంలో నాలుగు రోజులపాటు జరిగే రెండు అండర్-19 క్రికెట్ పోటీలకు దిగ్గజ ఆటగాడు సచిన్ తెండూల్కర్ కుమారుడు అర్జున్ తెండూల్కర్ ఎంపికయ్యాడు. 18 ఏళ్ల అర్జున్ తెండూల్కర్ ఎడమచేతివాటం బౌలర్‌గా, లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. శ్రీలంకలో పర్యటించే అండర్-19 రెండు బృందాలను గురువారం బెంగళూరులో ప్రకటించారు.