క్రీడాభూమి

యువత చేతుల్లో పర్యావరణ పరిరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 7: పర్యావరణ పరిరక్షణ యువత చేతుల్లోనే ఉందని ఒలింపిక్ రజత పతక విజేత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపింది. ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్న మసులా బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకేంద్రం మచిలీపట్నంలో 2కె రన్ నిర్వహించారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ, జిల్లా పర్యాటక శాఖ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయ, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సింధు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత యువత చేతుల్లో ఉందన్నారు. పర్యావరణానికి ముప్పు తెస్తున్న ప్లాస్టిక్ వినియోగంపై యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ముఖ్యంగా పశుపక్షాదులు ఈ ప్లాస్టిక్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. రానున్న 2019 సంవత్సరం నుండి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ పి అంకమ్మచౌదరి, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగార్రాజు, అర్జున అవార్డు గ్రహీత పీవీ రమణ, ముడ వైస్ చైర్మన్ పి విల్సన్ బాబు, జిల్లా పర్యాటక శాఖ ఈడీ మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.