క్రీడాభూమి

వివాదాలతో చెట్టపట్టాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో: ఇటీవల కాలంలో వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్ వివాదాలతో చెట్టపట్టాలేసుకొని ముందుకు సాగుతున్నది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’పై వచ్చినన్ని అవినీతి ఆరోపణలో బహుశా మరే ఇతర క్రీడా సమాఖ్యపై రాలేదేమో! 2018 వరల్డ్ కప్ కోసం రష్యా, 2022లో ఈ అవకాశాన్ని దక్కించుకోవడానికి కతార్ భారీగా ముడుపులు చెల్లించాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ కారణంగానే, మరోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన కొన్ని గంటల్లోనే సెప్ బ్లాటర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కొత్త అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నప్పటికీ, జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. రష్యాలో ఈనెల 14 నుంచి మొదలుకానున్న వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆరోపణలను, విమర్శలను ఎదుర్కొంటున్నది. ఈ హక్కులను చేజిక్కించుకోవడానికి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని సర్కారు వృథా చేసిందని ఆరోపిస్తూ, రష్యా నలుమూలలా నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతునే ఉన్నాయి. దాదాపు అన్ని నగరాల్లోనూ ఉద్యమాలు హోరెత్తిస్తున్నాయి. దేశంలో విద్య, వైద్యం వంటి వౌలిక సదుపాయాలను గురించి పట్టించుకోకుండా వరల్డ్ కప్ కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రజలు పెద్ద ఎత్తును నిరసనలకు దిగారు. దీనితో కంగుతిన్ని పుతిన్ సర్కారు వరల్డ్ కప్ నిర్వాహణ కోసం ముందుగా ఆమోదించిన 20 బిలియన్ డాలర్లను సగానికి సగం కుదించింది. 10 బిలియన్ డాలర్లకు మించి అదనంగా ఒక్క డాలర్‌ను కూడా ఖర్చు చేసేది లేదని ప్రకటించి, ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది. మొత్తం మీద సాకర్ అంటే ప్రాణం పెట్టే దేశాల్లో ఒకటైన రష్యాలో అదే క్రీడకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరగడం ఆశ్చర్యకరం. కనీసావసరాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పర్యవసానం ఇలానే ఉంటుందని రష్యన్లు నిరూపిస్తున్నారు. వీధుల్లో ప్రదర్శనలకే నిరసనకారులు పరిమితం కాలేదు. రష్యా సాకర్ జట్టును ప్రాక్టీస్‌కు వెళ్లకుండా అడ్డంగించే ప్రయత్నాలు కూడా చేశారు. వరల్డ్ కప్ పోటీలకు భారీ ఖర్చును నిరసిస్తూ ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని ర్యాలీలు నిర్వహించారు. వరల్డ్ కప్ జరిగే అన్ని కేంద్రాల్లోనూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ స్టికర్లను అంటించారు. మొత్తం మీద నిరసనల సెగ తగిలిన రష్యా ప్రభుత్వం దారికొచ్చింది. ఖర్చులను తగ్గించింది. కానీ, ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం అధికారులను వెంటాడుతునే ఉంది.
అక్రమాల ఊబి..
‘్ఫఫా’ అక్రమాల ఊబిలో కూరుకుపోతున్నది. అందుకే, దాని పర్యవేక్షణలో జరిగే వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి వరల్డ్ కప్ నిర్వాహణ హక్కులను కేటాయించేందుకే భారీగా ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో సాక్ష్యాధారాలతో సహా కొంత మంది అధికారులు పట్టుబడడం ఆ ఆరోపణలకు బలాన్నిస్తున్నది. సెప్ బ్లాటర్ హయాంలో ఫిఫా పూర్తిగా అవినీతిమయమైన ఫిఫాను ఇన్‌ఫాంటినో గట్టెక్కించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో ఫలితాలనిచ్చే అవకాశం లేదన్నది వాస్తవం. ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సెప్ బ్లాటర్‌ను వెటాడి, వెంటాడి చివరికి అతనితో రాజీనామా చేయించినా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పీఠమెక్కిన ఇన్‌ఫాంటినో వద్ద ఫిఫాను ఆదుకునే మంత్ర దండం ఉందనుకోవడం తప్పు.
అవినీతి ఆరోపణలు, ముడుపుల కుంభకోణాలు ఫిఫాకు కొత్తేమీ కాదు. చాలా సందర్భాల్లో ఆరోపణలు వెల్లువెత్తడం, అంతే హఠాత్తుగా చల్లబడిపోవడం కొన్ని దశాబ్దాలపాటు ఆనవాయితీగా కొనసాగింది. అయితే, తాజా ఉదంతం మాత్రం అంత త్వరగా ఫిఫాను వీడడం లేదు. ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ పోటీల నిర్వాహణ హక్కులను కట్టబెట్టేందుకు కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకున్నారని కార్యవర్గ సభ్యులపైనే ఆరోపణలు రావడంతో ఫిఫా ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతిన్నది. 2018 వరల్డ్ కప్ హక్కులను రష్యా సంపాదించుకుంటే, 2022లో మెగా టోర్నీ నిర్వాహణ బాధ్యతను కతార్ సొంతం చేసుకుంది. ఈ అవకాశం కోసం అమెరికాసహా పలు దేశాలు పోటీపడినప్పటికీ ఫలితం లేకపోయింది. తమను కాదని రష్యాకు ఏ విధంగా ఒలింపిక్స్ హక్కులను కట్టబెడతారని ఆగ్రహంతో ఉన్న అమెరికా పూర్తి స్థాయిలో దర్యాప్తును ఆరంభించడంతో అవినీతి భాగోతం బయటపడింది. ఫలితంగా అరెస్టులు, సస్పెన్షన్లు, బహిష్కరణలు కొనసాగుతున్నాయి. రష్యాకు అనుకూలంగా ఓటు వేయడానికి ఫిఫా కార్యవర్గ సభ్యులు భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు యావత్ క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అమెరికా నిఘా విభాగం కూడా ఈ విషయాన్ని ప్రాథమికంగా గుర్తించింది. రష్యాలో సదుపాయాలు, వసతులు మెరుగ్గానే ఉంటాయి కాబట్టి, ప్రపంచ కప్ సాకర్‌ను నిర్వహించడం వల్ల పెద్దగా సమస్యలు ఉండవు. మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే సామర్థ్యం ఉంది కాబట్టే రష్యాను ఎంపిక చేశామని ఫిఫా అధికారులు వాదిస్తున్నారు. కానీ, కతార్ ఎంపికను ఏవిధంగానూ సమర్థించుకునే పరిస్థితి లేదు. అక్కడ వౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. పైగా భద్రతాపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. అందుకే, ఫిఫాను అనుమానిస్తున్న క్రీడా ప్రపంచం, వరల్డ్ కప్‌ను కూడా అనుమానంగానే చూస్తున్నది.
వరల్డ్ కప్ హక్కుల కోసం అమెరికా భారీ ఎత్తున లాబీయింగ్ చేసింది. ఈ క్రమంలో 17 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టు అనధికార సమాచారం. అధికారికంగా 10 మిలియన్లను లాబీయింగ్ కోసం వెచ్చించినట్టు అమెరికా వెల్లడించింది. కతార్ నుంచి అంతకంటే ఎక్కువ సొమ్మును తీసుకొని, కార్యవర్గ సభ్యులంతా ఆ దేశానికి మద్దతు పలికారని ఆరోపిస్తున్నది. ఆర్థికపరమైన అవినీతికి, కుంభకోణాలకు పాల్పడిన ఫిఫా కార్యవర్గ సభ్యులపై అమెరికా మండిపడుతున్నది. ద్రోహం చేసిన ఫిఫా కార్యవర్గం అంతు చూడాలన్న పట్టుదలతో, ఆంతరంగిక మోసాల నిరోధక నిఘా విభాగానికి విచారణ బాధ్యతను అప్పగించింది. దీనితో ఫిఫా అవినీతి డొంక కదిలింది.
అమెరికా నిఘా విభాగం విచారణతో ఫిఫాలో చోటు చేసుకున్న భారీ కుంభకోణం బయటపడింది. ఫిఫా మాజీ కార్యవర్గ సభ్యులు జాక్ వార్నర్, నికోలాస్ లియోజ్‌లపై పలు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. భారీగా ముడుపులు తీసుకున్న తర్వాతే రష్యా, కతార్ దేశాలకు ప్రపంచ కప్‌ను నిర్వహించే హక్కులను ఇవ్వడానికి అనుకూలంగా ఓటు వేశారంటూ 14 మంది పేర్లను అమెరికా నిఘా విభాగం ప్రకటించింది. వెంటనే స్పందించిన జ్యూరిచ్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కూడా అరెస్టులు కొనసాగాయి. నిందితుల జాబితాలో మరికొన్ని పేర్లు చేరాయి. వీరిలో వార్నర్, లియోజ్ కోసం ఇంటర్‌పోల్ ఇప్పటికే ‘రెడ్ కార్నర్ నోటీసు’ జారీ చేసింది. ఆర్థిక నేరాల్లో పేరుమోసిన వారంతా ఫిఫాలో కార్యవర్గ సభ్యులుగా పనిచేసిన లేదా పనిచేస్తున్న వారు కావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. మొత్తానికి నిలువునా మునిగిపోతున్న ఫిఫాను ఒడ్డున చేర్చే ప్రయత్నం మాత్రం జరగలేదు. పరిస్థితి చక్కబడక ముందే వరల్డ్ కప్ వచ్చేసింది. సమస్య సమస్యగానే మిగిలిపోయింది.