క్రీడాభూమి

క్రీడాకారుల సంపాదనలో వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చత్తీస్‌గఢ్, జూన్ 8: క్రీడాకారుల సంపాదించే మొత్తంలో వాటా ఇవ్వాలంటూ హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలోని క్రీడాకారులు సంపాధించిన మొత్తం రూపాయల నుండి మూడో వంతు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులపై నిరసనలు వ్యక్తమవుతున్నాయ. వృత్తిపరమైన క్రీడల ఆదాయాన్ని, వాణిజ్యపరంగా వచ్చే ఆధాయంతో కలిసి లేక్క గట్టి, ఆ మొత్తంలో మూడో వంతు డబ్బును రాష్ట్ర క్రీడా మండలికి చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. క్రీడాకారుల నుండి వచ్చిన మొత్తాన్ని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి వినియోగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా నిర్ణయం ప్రకారం ఇక నుండి క్రీడాకారులకు వచ్చే ఆధాయంలో మూడోవంతు హర్యానా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీలో డిపాజిట్ చేయాల్సి వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైన స్టార్ బాక్సర్‌లు విజేందర్ సింగ్, అఖిల్ కుమార్‌తో ప్రస్తుతం డీఎస్పీలుగా, హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్, రెజ్లర్‌లు గీతా, బబితా ఫొగట్, సర్దార్ సింగ్ కూడా పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇటీవల ముగిసిన కామనె్వల్త్ క్రీడల్లో బబిత రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా బబితా పోగట్ మాట్లాడుతూ, పభుత్వం జారీ చేసిన జీవో క్రీడాకారులుగా ఎదగాడానికి ఏలాంటి ఆటంకం కలిగించదని, తాము సంపాంధించిన ప్రతి రూపాయిపై ప్రభుత్వానికి పన్నులు కడుతున్నామని చెప్పింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలంటే ఒక క్రీడాకారుడు, క్రీడాకారిణి ఎంత త్యాగం చేయాల్సి ఉంటుందో ప్రభుత్వ అర్థం చేసుకోవాలని అమె సూచించింది. తక్షంమే ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసి క్రీడాకారుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని బబితా అన్నది.