క్రీడాభూమి

స్వల్పంగా దెబ్బతిన్న కోహ్లీ మైనపు విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: దేశ రాజధాని న్యూఢిల్లీలోని మేడమ్ టుస్పాడ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన టీంమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం స్వల్పంగా దెబ్బతింది. ఈ విగ్రహం రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బుధవారంనాడు విరాట్ విగ్రహాంను మ్యూజియం నిర్వహకులు ఆవిష్కరించడం జరిగింది. విగ్రహం ఆవిష్కరించిన తర్వాత అభిమానులు కోహ్లీ విగ్రహంతో సెల్ఫీలు దిగాడానికి అభిమానులు, క్రికెటర్‌లు పోటీపడ్డారు. కోహ్లీ కూడి చెవి స్వల్పంగా దెబ్బతిన్నది. ఇది గమనించిన మ్యూజియమ్ నిర్వాహకులు వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. దెబ్బతిన్న చెవి భాగంకు సంబంధించిన కోలతలు తీసి నిపుణులకు పంపించిన మ్యుజియం అధికారులు విగ్రహంను వెంటనే బాగుచేస్తామని తెలిపారు. కోహ్లీ విగ్రహంలో చెవి భాగం దెబ్బతిన్న ప్రాంతానికి సంబంధించిన వీడియోలు అంర్జాలంలో హాల్‌చల్ చేస్తున్నాయి. టుస్పాడ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన భారత క్రికెటర్‌లకు సంబంధించి విరాట్ కోహ్లీ విగ్రహం మూడవది. అంతకు ముందు మ్యూజియంలో కపిల్‌దేవ్, సచిన్ తెండూల్కర్‌తో పాటు విధేశీ ఆటగాళ్లు డెవీడ్ బెక్‌హామ్, లినోల్ మెస్సీ, ఉసేన్ బోల్ట్ విగ్రహలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి గ్ఞాపకాలను గుర్తుంచుకుంటానని, ఈ విషయంలో అభిమానుల స్పందన ఏలా ఉంటుందో వేచిచుడాల్సిందే.