క్రీడాభూమి

ఫిట్నెస్ టెస్టులో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న ఇద్దరు భారత క్రికెట్ బ్యాట్స్‌మెన్‌లు రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగే టెస్టు మ్యాచ్‌లకు దూరం కానున్నారు.
ఇంగ్లాండ్‌లో ఈనెల 22 నుండి నిర్వహించే వనే్డ ట్రైసిరీస్‌లో పాల్గొనే భారత్-ఏ జట్టుకు ఎంపికైన కేరళకు చెందిన వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఫిట్నెస్ పరీక్షల్లో విఫలం కావడంతో అతనిని టెస్టుకు దూరంగా ఉంచారు. సంజూ శాంసన్‌కు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో 16.1 మార్క్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సంజూ శాంసన్ ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించి 31.50 సరాసరిన 441 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. తన ఐపీఎల్ క్రీడా చరిత్రలో అతను మొత్తం 81 మ్యాచ్‌లు ఆడి, ఇంతవరకు 1867 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌లో ఆడే భారత్-ఏ టీమ్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. అయితే, సంజూ శాంసన్ స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇదిలావుండగా, ఇంగ్లాండ్-ఏతో వర్సెస్టర్‌లో జూలై 16 నుంచి 19 వరకు నిర్వహించే నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో ఆడనుంది.
అదేవిధంగా ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్న టీమిండియా బ్యాట్స్‌మన్ మహ్మద్ షమీని సైతం సెలక్టర్లు ఈనెల 14 నుంచి బెంగళూరులో అఫ్గనిస్తాన్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌కు దూరంగా పెట్టారు. ఫిట్నెస్ పరీక్షల్లో షమీ విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అతని స్థానంలో ఢిల్లీ క్రికెటర్ నవదీప్ సైనీని ఎంపిక చేశారు. 25 ఏళ్ల నవదీప్ షైనీ గడిచిన రెండు సీజన్‌లలో జరిగిన రంజీ ట్రోఫీల్లో అద్భుత ప్రదర్శన చూపాడు. తన కెరీర్‌లో ఇంతవరకు 31 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాకుండా భారత్-ఏ జట్టు వచ్చేనెలలో ఇంగ్లాండ్‌లో జరిగే నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌కు సైతం నవదీప్ షైనీ ఎంపికయ్యాడు. కాగా, కరణ్ నాయర్, హార్థిక్ పాండ్య ఫిట్నెస్ పరీక్షల్లో నెగ్గారు.