క్రీడాభూమి

నేను పూర్తిగా మారిపోయాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంటెవీడియో (ఉరుగ్వే), జూన్ 11: బ్రెజిల్‌లో జరిగిన 2014 సాకర్ వరల్డ్ కప్‌తో పోలిస్తే తాను ఇప్పుడు పూర్తిగా మారిపోయానని, గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకున్నానని ఉరుగ్వే స్ట్రయికర్ లూయిస్ సొరెజ్ స్పష్టం చేశాడు. ఈసారి వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు రష్యాకు బయలుదేరే ముందు ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ బ్రెజిల్ సాకర్ వరల్డ్ కప్‌లో చోటు చేసుకున్న సంఘటనను దురదృష్టకరమైనదిగా అభివర్ణించాడు. ఆ టోర్నీలో ఇటలీ డిఫెండర్ జార్జియో చియెలినీ భుజాన్ని గట్టిగా కొరికిన సొరెజ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఆ సంఘటన అప్పట్లో దుమారం రేపింది. వరల్డ్ కప్ వంటి మేజర్ ఈవెంట్‌లో ప్రత్యర్థి ఆటగాడిని పళ్లు దిగబడేలా కొరవడం క్రీడాస్ఫూర్తికే విఘాతమని ప్రతి ఒక్కరూ విరుచుకుపడ్డారు. ఆ సంఘటనపై చింతిస్తున్నానని, తనను క్షమించాలని సొరెజ్ కోరగా, చియెలినీ సరే అనడంతో వివాదానికి తెరపడింది. అయితే, అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ మాత్రం ఆ సంఘటనను తీవ్రంగా తీసుకుంది. అతనిని ఆతర్వాతి మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేసింది. కీలక ఆటగాడు సొరెజ్ లేకపోవడంతో ఉరుగ్వే పోరాటం ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌తోనే ముగిసింది. కొలంబియా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని ఉరుగ్వే నిష్క్రమించింది. అప్పటి సంఘటనను సొరెజ్ గుర్తు చేసుకుంటూ, ఈసారి ఉరుగ్వేను గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నాడు. అప్పటి పొరపాటుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటానని చెప్పాడు. ఈసారి వరల్డ్ కప్‌లో ఉరుగ్వేకు టైటిల్ సాధించి పెట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.

జార్జియో చియెలినీ (ఎడమ)ని కొరికిన లూయస్ సొరెజ్ (ఫైల్‌ఫొటో)