క్రీడాభూమి

ఉతప్ప అర్ధ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, ఏప్రిల్ 19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై విజయభేరి మోగించింది. పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేయగా, నైట్ రైడర్స్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్లకు 141 పరుగులు సాధించింది. ఓపెనర్ రాబిన్ ఉతప్ప 28 బంతుల్లోనే 54 పరుగులు చేసి నైట్ రైడర్స్ విజయానికి బాటలు వేశాడు. కెప్టెన్ గౌతం గంభీర్ 34 పరుగులతో జట్టును సురక్షిత స్థానానికి చేర్చాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్
బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉందన్న నమ్మకంతో టాస్ గెలిచిన నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన మురళీ విజయ్, మానన్ వోహ్రా మొదటి వికెట్‌కు 21 పరుగులు జోడించారు. 12 బంతుల్లో 8 పరుగులు చేసిన వోహ్రాను షకీబ్ అల్ హసన్ క్యాచ్ పట్టగా మోర్న్ మోర్కెల్ అవుట్ చేయడంతో ఆరంభమైన పంజాబ్ వికెట్ల పతనం నిరాటంగా కొనసాగింది. మురళీ విజయ్, షాన్ మార్ష్ తప్ప ఎవరూ రెండంకెల స్కోర్లు చేయలేకపోయారు. విజయ్ 22 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 26 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఒంటరి పోరాటాన్ని కొనసాగించిన షాన్ మార్ష్ 41 బంతుల్లో అజేయంగా 56 పరుగులు సాధించాడు. అతని స్కోరులో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అతని కృషి ఫలితంగా పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులకు చేరుకోగలిగింది. నైట్ రైడర్స్ బౌలర్లలో మోర్కెల్ 27 పరుగులకు రెండు, సునీల్ నారైన్ 22 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు.
వేగంగా పరుగులు
పంజాబ్‌ను ఓడించడానికి 138 పరుగులు సాధించాల్సి ఉండగా, నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ గౌతం గంభీర్, రాబిన్ ఉతప్ప ధాటిగా ఆరంభించారు. ఇద్దరూ 4.4 ఓవర్లలోనే స్కోరును 50 పరుగుల మైలురాయికి చేర్చారు. అదే ఊపును కొనసాగించడంతో 8.3 ఓవర్లలో స్కోరు 82 పరుగులకు చేరింది. కేవలం 28 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లతో 53 పరుగులు చేసిన రాబిన్ ఉతప్పను పారదీప్ సాహు ఎల్‌బిగా అవుట్ చేయడంతో నైట్ రైడర్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. గంభీర్ 34 బంతుల్లో 34 పరుగులు సాధించి సాహు బౌలింగ్‌లోనే గ్లేన్ మాక్స్‌వెల్‌కు చిక్కాడు. మోహిత్ శర్మ వేసిన 12వ ఓవర్ మొదటి బంతిని మనీష్ పాండే బౌండరీకి తరలించి, నైట్ రైడర్స్ స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించాడు. మనీష్ పాండే 12 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 110 పరుగుల వద్ద నైట్ రైడర్స్ మూడో వికెట్ కోల్పోయింది. సాధించాల్సిన రన్‌రేట్ తక్కువగా ఉందన్న ఉద్దేశంతో నింపాదిగా ఆడిన షకీబ్ అల్ హసన్ 15 బంతుల్లో 11 పరుగులు చేసి, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సందీప్ శర్మ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరారు. యూసుఫ్ పఠాన్ వచ్చీ రావడంతోనే తనదైన శైలిలో దాడికి దిగాడు. కేల్ అబోట్ వేసిన ఓవర్‌లో అతను రెండు ఫోర్లు బాదాడు. 18వ ఓవర్‌ను వేసిన మోహిత్ శర్మ మొదటి బంతిని సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టడంతో నైట్ రైడర్స్ 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 141 పరుగులు చేసి, ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. అప్పటికి సూర్యకుమార్ 11, యూసు ఫ్ పఠాన్ 12 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 (విజయ్ 26, షాన్ మార్ష్ నాటౌట్ 56, మోర్కెల్ 2/27, సునీల్ నారైన్ 2/22).
కోల్‌కతా నైట్ రైడర్స్: 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 141 (రాబిన్ ఉతప్ప 53, గౌతం గంభీర్ 34, యూసుఫ్ పఠాన్ నాటౌట్ 12, సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 11).

పవర్ ప్లేలో నైట్ రైడర్స్ 65 పరుగులు సాధించింది. ఈసారి ఐపిఎల్‌లో ఇదే అత్యధిక స్కోరు. అంతకు ముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పవర్ ప్లేలో 63 పరుగులు చేసింది.