క్రీడాభూమి

ప్రపంచ కప్ తర్వాత కెరీర్‌పై నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రోనిట్సీ (రష్యా): ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌పై తుది నిర్ణయం తీసుకుంటానని అర్జెంటీనా సాకర్ హీరో లియోనెల్ మెస్సీ స్పష్టం చేశాడు. సోమవారం అతను ఒక స్పానిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరల్డ్ కప్‌లో అర్జెంటీనా ఏ విధంగా ఆడుతుందనే అంశంపైనే తన నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నాడు. వరుసగా మూడు టోర్నీల్లో ఫైనల్ వరకూ చేరినప్పటికీ, టైటిళ్లను కైవసం చేసుకోలేకపోయామని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని అన్నాడు. 2014 వరల్డ్ కప్ ఫైనల్‌లో జర్మనీతో తలపడిన అర్జెంటీనా ఎక్‌స్ట్రాటైమ్‌లో 0-1 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఆతర్వాత 2015, 2016 సంవత్సరాల్లో కోపా అమెరికా ఫైనల్ చేరింది. కానీ, రెండు పర్యాయాలు కూడా చిలీతో ఫైనల్ ఆడింది. పెనాల్టీ షూటౌట్‌లో ఓటమిపాలైంది. మూడు వరుస ఫైనల్ వైఫల్యాలు జట్టును పునరాలోచనలో పడేశాయని, పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నాడు. అర్జెంటీనా మరోసారి ఫైనల్ చేరుతుందని జోస్యం చెప్పిన 31 ఏళ్ల మెస్సీ ఈసారి వరల్డ్ కప్‌లో స్పెయిన్, బ్రెజిల్, డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం జట్లు కూడా టైటిల్ రేసులో ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఎన్నో జట్లు, ఎన్నో ఆశలతో, ఎంతో ఆత్మవిశ్వాసంతో వరల్డ్ కప్‌లో బరిలోకి దిగుతున్నాయని, కాబట్టి వేటినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని ఐదోసారి ఈ మెగా టోర్నీలో ఆడుతున్న మెస్సీ అన్నాడు. మాస్కోలో శనివారం ఐస్‌లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ఈ జట్టు పోటీపడుతున్న ‘డీ’ గ్రూపులో క్రొయేషియా, నైజీరియా కూడా ఉన్నాయి.

చిత్రం..అర్జెంటీనా ఆశాజ్యోతి లియోనెల్ మెస్సీ